

జమ్మికుంట పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు సుంకరి రమేష్..
జనం న్యూస్ // ఏప్రిల్ // 7 // కుమార్ యాదవ్ // జమ్మికుంట..
ఏఐసీసీ మరియు టీపీసీసీ అధ్యక్షుల పిలుపుమేరకు హుజురాబాద్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ ప్రణవ్ ఆదేశానుసారం జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు సుంకరి రమేష్ ఆధ్వర్యంలో, జై బాపు, జై భీమ్, జై సమిధన్ రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర లో భాగంగా 17. 18. 19 .20 వార్డులలో పాదయాత్ర చేయడం జరిగినది. ఇట్టి కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వరంగల్ కూడా చైర్మన్ ఇనగల వెంకటరామిరెడ్డి, మరియు కరీంనగర్ కార్పొరేటర్ అశోక్ రావు, పిసిసి మెంబర్ బొమ్మనపల్లి అశోక్ రెడ్డి, పాల్గొన్నారు. అలాగే ఇల్లంతకుంట దేవస్థానం మాజీ చైర్మన్ దేశిని కోటి, జమ్మికుంట మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఎర్రం సతీష్ రెడ్డి, మాజీ కౌన్సిలర్స్ పొనగంటి మల్లయ్య, బొంగుని వీరయ్య గౌడ్, దేశిని సదానందం, దిద్ది రాము, రావికంటి రాజు, శ్రీహరి, పిట్టల రమేష్, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు పూదరి రేణుక శివకుమార్ గౌడ్, మరియు వార్డు అధ్యక్షులు సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితర అనుబంధ సంఘాలు పాల్గొన్నాయి.
