Listen to this article

బిచ్కుంద ఏప్రిల్7:- జనం న్యూస్

ప్రభుత్వ డిగ్రీ కళాశాల (అటానమస్ )బిచ్కుంద ఎన్ఎస్ఎస్ యూనిట్ I & II ఆధ్వర్యంలో పుల్కల్ మరియు పెద్దదేవడ గ్రామంలో ప్రత్యేక శిబిరం నేటి నుండి తేదీ 13 /04 /25 వరకు నిర్వహిస్తున్నారని పుల్కల్ గ్రామంలోని రైతు వేదిక వద్ద ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ కె. అశోక్ తెలిపారు. విద్యార్థులు ఉద్దేశించి మాట్లాడుతూ విద్యతోపాటు సామాజిక సేవలు కూడా విద్యార్థి దశలోనే అలవర్చుకోవాలని జాతీయ సేవా పథకం( ఎన్ఎస్ఎస్) తో అది సాధ్యమవుతుందని ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకోవాలని వాలంటీర్లను సూచించారు ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ జి. వెంకటేశం మరియు వై. సంజీవరెడ్డి అధ్యాపక బృందం వాలంటీర్లు పాల్గొన్నారు