Listen to this article

జంతువులకు నీటి తొట్టెలు ఏర్పాటు చేయండి.

జనం న్యూస్,ఏప్రిల్07, జూలూరుపాడు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, జూలూరుపాడు అటవీ రేంజ్

రిధిలోని సూరారం గ్రామ సమీపంలోని కనకగిరి రిజర్వ్ ఫారెస్ట్ ను సోమవారం నాడు కొత్తగూడెం డివిజనల్ అధికారి కోటేశ్వరరావు పరిశీలించారు. వేసవి కాలం కావడంతో అటవీ జంతువులకు నీటి ఏర్పాట్ల గురించి మరియు అగ్ని ప్రమాదాల గురించి వివరాలు తెలుసుకొని అటవీ సిబ్బందికి తగు సూచనలు ఇచ్చారు. అనంతరం, అనంతారం గ్రామం నుంచి నల్ల బండబోడు గ్రామం వరకు రోడ్డు వెంబడి వేసిన ఎవెన్యూ ప్లాంటేషన్ ను పరిశీలించి మొక్కల పెరుగుదలకు తీసుకోవలసిన చర్యల గురించి సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో జూలూరుపాడు రేంజ్ అధికారి ప్రసాద్ రావు, గుండెపుడి డిఆర్ఓ ఎస్.కె నాసూర్ బి, జూలూరుపాడు ఎఫ్ఎస్ఓ ఎం హనుమంతు, గుండెపుడి డిఆర్ఓ,ఎఫ్ బి ఓ, డి కిషన్,సూరారం ఎఫ్ బి ఓ శ్రీలత పాల్గొన్నారు.