

రేషన్ కార్డు లబ్ధిదారుడి ఇంటికి వెళ్లి సహాపంక్తి భోజనం చేసిన ప్రణవ్..
జనం న్యూస్ // ఏప్రిల్ // 7 // కుమార్ యాదవ్ // జమ్మికుంట..
హుజురాబాద్ పట్టంలోని 13వ వార్డులో రేషన్ కార్డు లబ్దిదారుడు పోతుల శ్రీవాణీ – శ్రీనివాస్ నివాసానికి హుజరాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ ఒడితల ప్రణవ్ స్వయంగా వెళ్లి, లబ్ధిదారుల కుటుంబసభ్యులతో కలిసి రేషన్ షాపుల్లో పంపిణీ చేసిన ప్రభుత్వ సన్న బియ్యంతో సహపంక్తి భోజనం చేసారు.అనంతరం ప్రణవ్ బాబు మాట్లాడుతూ..రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ గ్రామాన ప్రజల నుంచి ఊహించని స్పందన కనబడుతుందని హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ అన్నారు..కాంగ్రెస్ ప్రభుత్వం అంటే పేదల కష్టాలు తీర్చే పార్టీ అని,ప్రభుత్వం ఇచ్చే సన్నబియ్యతో భోజనం చేయడం సంతోషాన్ని కలిగించిందని,ధనిక వర్గాలు తినే సన్న బియ్యం నిరుపేద గడపల్లో కూడా వండడం గొప్ప విషయమని అన్నారు.గతంలో దొడ్డు బియ్యం ఇస్తే లబ్దిదారులు అమ్ముకునే పరిస్థితి ఉండేదని,ఇప్పుడు రేషన్ షాపులో సన్నబియ్యం కోసం పోటీ పడుతున్నారని,పథకం ప్రవేశపెట్టిన వారం రోజులలోపే 95% మంది సన్నబియ్యం తీసుకుంటున్నారని తెలిపారు.కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నంత వరకు ఉచిత సన్నబియ్యం కొనసాగుతుందని,దేశ చరిత్రలో నిలిచిపోయే పథకమని అన్నారు.అన్ని వర్గాల ప్రజలకు ఆదుకుంటూ సంక్షేమ పథకాలైన సన్నబియ్యం,గృహ జ్యోతి,మహిళలకు ఉచిత రవాణా సౌకర్యం,500 కే సిలెండర్ లాంటి పథకాల ద్వారా ఒక్కో రేషన్ కార్డు లబ్దిదారులకు నెలకు 2500 వరకు ఆదా జరుగుతుందని వివరించారు.ఇలాంటి మంచి పథకాలు కొనసాగిస్తున్న సిఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞత తెలిపారు. తదనంతరం లబ్ధిదారులు మాట్లాడుతూ .. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సన్నబియ్యాన్ని పేదలకు పంచడం ఆనందంగా ఉందని లబ్దిదారురాలు శ్రీవాణి అన్నారు.ఆహ్వానం మేరకు ప్రణవ్ మా ఇంటికి రావడం సంతోషాన్ని కలిగించిందని,మేము తినే అన్నమే ప్రణవ్ కు స్వయంగా వడ్డించామని అన్నారు. ఇప్పుడు రేవంత్ సర్కార్ లో సన్నబియ్యంతో కడుపు నింపుతున్నారని ఆనందం వ్యక్తం చేసారు. ఈ కార్యక్రమంలో హుజురాబాద్ పట్టణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు వేముల పుష్పలత, మరియు కాంగ్రెస్ సీనియర్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
