Listen to this article

జనం న్యూస్ కాట్రేనికోన ఏప్రిల్ 7

కాట్రేనికోన పంచాయతీ పరిధిలో ని సంత మార్కెట్ ప్రాంతంలో జరుగుతున్న డ్రైనేజీ నిర్మాణ పనులను ప్రభుత్వ విప్, స్థానిక శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు స్థానిక నాయకులతో కలిసి సోమవారం సాయంత్రం పరిశీలించారు. . ఇంజనీరింగ్ సిబ్బందిని పనులకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. డ్రైనేజీ ద్వారా నీరు సక్రమంగా వెళ్ళే విధంగా నీరు వాలు గురించి అడిగి తిలుసుకున్నారు. ఇంజనీరింగ్ సిబ్బందికి పలు సూచన చేశారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి, కనకదుర్గమ్మ గుడి వద్ద నీరు నిలవ ఉండే అవకాశం ఉన్నందున దాని నివారణకు ఇంజనీరింగ్ అధికారులతో మాట్లాడి చర్యలు తీసుకోవాలని, ఆ ప్రాంతాన్ని మేర క చేయవలసిన అవసరం ఉందని ఆయన తెలిపారు. మార్కెట్ లో మహిళలకు ఆయన నమస్కరిస్తూ ముందుకు సాగారు కార్యక్రమంలో దాట్ల పవన్ పి ఎస్ ఎన్ రాజు, రవి వర్మ, వాసంశెట్టి రాజేశ్వరరావు, బండారు ఏసు, కడలి సత్యనారాయణ, కముజు రాంబాబు, కముజు సర్వేష్, వెంట్రు సుధీర్ తదితరులు ఉన్నారు