Listen to this article

ఆరోగ్యకరమైన ప్రారంభం – ఆశాజనక భవిష్యత్తు అనే అంశంతో అవగాహన సదస్సు

జనం న్యూస్,ఏప్రిల్ 07,అచ్యుతాపురం:


ప్రతీ సంవత్సరం ఏప్రిల్ 7న ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆరోగ్యంపై అవగాహన దినంగా1948లో,
డబ్ల్యూహెచ్ఓ మొదటి ప్రపంచ ఆరోగ్య సభను నిర్వహించిందని హరిపాలెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారులు డాక్టర్ రవిబాబు, డాక్టర్ మానస ర్యాలీ, అవగాహన సదస్సులు నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 1950 నుండి ప్రపంచ ఆరోగ్య దినోత్సవంగా ప్రతి సంవత్సరం ఏప్రిల్ 7ను జరుపుకోవాలని అసెంబ్లీ నిర్ణయించింది.డబ్ల్యూహెచ్ఓ స్థాపనకు గుర్తుగా ప్రపంచ ఆరోగ్య దినోత్సవం జరుగుతుందని, ప్రతి సంవత్సరం ప్రపంచ ఆరోగ్యానికి ప్రధాన ప్రాముఖ్యత ఉన్న అంశంపై ప్రపంచవ్యాప్త దృష్టిని ఆకర్షించేటట్లు ఈ సంస్థ చూస్తుందని, డబ్ల్యూహెచ్ఓ ఒక నిర్దిష్ట ఇతివృత్తానికి సంబంధించిన అంతర్జాతీయ, ప్రాంతీయ, స్థానిక కార్యక్రమాలను నిర్వహిస్తుందని, దానిలో భాగంగా ఈ సంవత్సరం ఆరోగ్యకరమైన ప్రారంభం – ఆశాజనక భవిష్యత్తు అనే అంశంతో ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య విస్తరణాధికారి ఎస్.శ్రీనివాస్, ఆరోగ్య భోదకులు రామలక్ష్మి, ఆరోగ్య పర్యవేక్షకులు సునీత, ఉమా మహేష్, వైద్య సిబ్బంది శాంతి, గణేష్, ఇందిర, నాగేశ్వరరావు,వరలక్ష్మి, జోష్ణ, నాగ వరలక్ష్మి, మంగమ్మ తదితరులు పాల్గొన్నారు.