Listen to this article

జనం న్యూస్ జనవరి 15 చిలుకూరు(మండల ప్రతినిధి ఐనుద్దీన్) చిలుకూరు మండలంలోని జెర్రిపోతులగూడెం గ్రామంలో సంక్రాంతి పండుగ సందర్భంగా బండి వెంకటరెడ్డి,వెన్నం రాంప్రసాద్ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలను నిర్వహించారు ఈ పోటీల్లో అధిక సంఖ్యలో మహిళా సోదరీమణులు పాల్గొని వారి యొక్క కళను రంగుల రూపంలో తెలియజేశారు పండుగ సందర్భంగా ఇలాంటి కార్యక్రమాలు చేయడం చాలా గొప్ప విషయమని గ్రామ పెద్దలు నిర్వాహకులను ప్రశంసించారు ఈ సందర్భంగా నిర్వాహకులు వెంకటరెడ్డి,రాంప్రసాద్ మాట్లాడుతూ మాకు సహకరించిన దాతలకి,మహిళలకు,గ్రామ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.అలాగే వచ్చే సంవత్సరం భారీస్థాయిలో ఈ పోటీలు నిర్వహిస్తామని నిర్వాహకులు ఉన్నారు. ముగ్గుల పోటీల్లో ప్రథమ బహుమతి రాంశెట్టి విజయ,ద్వితీయ బహుమతి వెన్నం లక్ష్మీ పావని, తృతీయ బహుమతి చింతమల్ల శ్రీదేవి,వీరికి నిర్వాహకులు బహుమతితో సత్కరించారు ఈ కార్యక్రమంలో పద్మ,ఆకాంక్ష,దాతలు చంద్రు నాయక్,ఆవుల అంజి కుమార్,రణబోతు అనూష గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు