

జనం న్యూస్ 08 ఏప్రిల్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక
విజయనగరం జిల్లా నెల్లిమర్ల నగర పంచాయతీ, జరజాపు పేట గ్రామానికి చెందిన నల్లి ఉమాశంకర్ గత కొన్నేళ్లుగా కిడ్నీ సమస్యతో బాధపడుతూ మృతి చెందారు. అంతిమయాత్ర అనంతరం అంత్యక్రియలు చేపట్టడం జరిగింది. నల్లి ఉమాశంకర్ సాధన యువజన సంఘంలో క్రియాశీలక సభ్యుడిగా స్థాపించిన తొలినాళ్లలో పదేళ్లపాటు ఉపాధ్యక్షుడిగా సేవలు అందించారు. ఆయన వృత్తిపరంగా పాల కేంద్రంలో పనిచేస్తూ ఎంతోమంది పాడి రైతులకు సేవలందించారు. ఉమా శంకర్ గత కొద్ది ఏళ్ల క్రితమే తండ్రిని కూడా కోల్పోయారు. ఉమాశంకర్కి కిడ్నీ సమస్య కారణంగా ఆర్థికంగా కుటుంబం ఇబ్బందికి గురైంది. ఈ సందర్భంలోనే కొన్నిసార్లు సాధన యువజన సంఘం ద్వారా ఆర్థిక చేయూతను అందించి కొంతమేరకు ఊరట నివ్వడం జరిగింది. అయినప్పటికీ ఫలితం లేకపోయింది. ఉమాశంకర్ సేవలను యువత గ్రామస్తులు ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటూ కన్నీటి పర్యంతం చెందారు. నల్లి ఉమా శంకర్కి సద్గతి ప్రాప్తించాలని, వారి కుటుంబానికి మానసిక ధైర్యాన్ని ఆ భగవంతుడు ఇవ్వాలని ఈ సందర్భంగా గ్రామ పెద్దలు సముద్రపు రామారావు, ఎం. ఎం. నాయుడు, నల్లి శేఖర్, తుమ్మ వెంకటరమణ, నల్లి శ్రీను, మద్దిల అప్పన్న, మద్దిల వాసు, ఎంఈఓ పోలుబోతు రామారావు, సాధన యువజన సంఘం అధ్యక్షులు పోలుబోతు దుర్గాప్రసాద రావు, ఉపాధ్యక్షులు బెల్లాన్ని వెంకటరావు, ప్రధాన కార్యదర్శి పసుమర్తి వెంకటరమణ, సభ్యులు a. అశోక్, పల్ల శ్రీహరి, ముగ్గు జ్యోతికృష్ణ, కోన ముత్యాల నాయుడు తదితరులు ఈ సందర్భంగా నివాళులర్పించి ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు.