Listen to this article

జనం న్యూస్. ఏప్రిల్ 7. మెదక్ జిల్లా. నర్సాపూర్. కాంసెన్సీ ఇన్చార్జ్. (అబ్దుల్ రహమాన్)

తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్ బాలుర-1 నర్సాపూర్‌ లో ఆంగ్ల ఉపాధ్యాయుడు ప్రముఖ రచయిత కొండ మురళి తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ సొసైటీ కార్యదర్శి శ్రీ తఫ్సీర్ ఇక్బాల్.ఐపీఎస్ ని మర్యాదపూర్వకంగా కలిసి తన రచనా ప్రస్థానంలో తాజా పుస్తకాలైన క్రూసేడర్ వేదన సంకల్పం మరియు పర్సివీరెన్స్ నువారికి బహుకరించారు.ఈ సందర్భంలో తఫ్సీర్ ఇక్బాల్ కొండ మురళి సాహిత్య ప్రతిభను అభినందిస్తూ విద్యారంగానికి వారు అందిస్తున్న సేవలను ప్రశంసించారు. విద్యార్థులలో సృజనాత్మకతను పెంపొందించేందుకు మురళి చేస్తున్న ప్రయత్నాలు ప్రేరణకు కారణమవుతాయని పేర్కొన్నారు. కొండ మురళి ఇప్పటికే ఎన్నో బెస్ట్ సెల్లర్ పుస్తకాలను రచించి సాహిత్యంలో తనదైన ముద్ర వేశారని ఆయన రచనలు ప్రేమ, జీవితం, సంస్కృతి, సంకల్పశక్తి వంటి విలువలపై ఆధారపడి ఉంటాయని ఈ కార్యక్రమం విద్యార్థులు మరియు ఉపాధ్యాయుల్లో సాహిత్య అభిమానం పెరిగేలా ప్రేరణనిస్తుందని తెలిపారు.