Listen to this article

-జిల్లా కార్యవర్గ సభ్యులు నరసింహారావు
జనం న్యూస్ జనవరి 15 చిలుకూరు (మండల ప్రతినిధి ఐనుద్దీన్)… చిలుకూరు మండలంలోని కొండాపురం గ్రామంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నరసింహారావు ఆధ్వర్యంలో సిపిఎం రాష్ట్ర మహాసభల కరపత్రాలు విడుదల చేసి ఇంటింటికి ప్రచారం నిర్వహించారు ఈసందర్భంగా నరసింహారావు మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా ప్రజా సమస్యల నిరంతరం పోరాటం చేసే పార్టీ పేద ప్రజల పక్షాన నిలబడే పార్టీ సిపిఎం పార్టీ మాత్రమే అని అన్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పేదలను అనేక రకాలుగా ఇబ్బంది గురి చేస్తున్నారని రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన ఆరు హామీలను వెంటనే అమలు చేసేలా ప్రణాళిక ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు సిపిఎం పార్టీ నాలుగవ మహాసభలను జయప్రదం చేయాలని 20వ తేదీన జరిగే బహిరంగ సభకు రాష్ట్రం వేలాదిగా రావాలని ప్రజలను పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో సిపిఎం సీనియర్ నాయకులి వెంకటేశ్వరరావు,వేనేపల్లి వెంకటేశ్వర రావు,సిపిఎం మండల కార్యదర్శి నాగేటి రాములు,ప్రజానాట్యమండలి కార్యదర్శి వేల్పుల వెంకన్న, యాదాల వీరస్వామి,కందుల శ్రీకాంత్, కోటేశ్వరరావు,జయరాజు, సతీష్,రామలక్ష్మణులు తదితరులు పాల్గొన్నారు.