Listen to this article

పదివేల రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికిన అవినీతి తిమింగలం..

జనం న్యూస్ // ఏప్రిల్ // 8 // కుమార్ యాదవ్ // జమ్మికుంట..

కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నియోజకవర్గం జమ్మికుంట పట్టణంలోని ఐకెపి కార్యాలయంలో ఏసీబీ డి.ఎస్.పి రమణమూర్తి ఆధ్వర్యంలో ఐకెపిలో పనిచేస్తున్న కమ్యూనిటీ కోఆర్డినేటర్ సురేష్ (10000) పదివేల రూపాయలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఐకెపి కార్యాలయం కు కూడా అవినీతి మకిలి పట్టింది. వివరాల్లోకి వెళితే జమ్మికుంట మండలం లోని ఐకేపీ కార్యాలయంలో పెద్దంపల్లి గ్రామానికి చెందిన స్వప్న వి ఓ ఏ గా విధులు నిర్వహిస్తున్నారు. గత నాలుగు సంవత్సరాలుగా జీతం డబ్బులు చెక్కు ఇవ్వాలని అడగగా, (20000 )రూపాయలు లంచం ఇస్తే నే నీకు చెక్కు ఇస్తాను, అని అన్నారు అని స్వప్న తెలిపారు. కాగా నాలుగు వేల రూపాయలు ఇచ్చాను, అని వివరించారు. అయినా కూడా 15000 రూపాయలు ఇస్తేనే చెక్ పాస్ చేస్తా అని, లేకపోతే ఇవ్వడం కుదరదు అని సురేష్ అనగానే, నాకు వేరే మార్గం లేక మంగళవారం నాడు( 10000 )రూపాయలు ఇస్తాను అని చెప్పగా, సురేష్ కూడా సరే అన్నారు అని తెలిపారు. వేరే గత్యంతరం లేక ఎసిబి వాళ్లను సంప్రదించడం జరిగింది అని స్వప్న అన్నారు. కాగా కొన్ని గవర్నమెంట్ కార్యాలయలు అక్రమాలకు అడ్డాగా మారాయి. చిన్నస్థాయి సిబ్బంది నుంచి అధికారుల వరకు పనికో ధర నిర్ణయించి డబ్బులు దండుకోవడం నిత్యకృత్యంగా మారింది. కానీ ఇ అవినీతి చేప సురేష్ లంచం డిమాండ్ చేయడం తోనే స్వప్న ఏసీబీ అధికారులను ఆశ్రయించడంతో, ఇ సురేష్ అవినీతి బండారం బయటపడింది. స్వప్న నుంచి 10 వేలు లంచం తీసుకుంటూ మంగళవారం నాడు అవినీతి నిరోధక శాఖ అధికారులకు అడ్డంగా ఇ అవినీతి ( చేప ) సురేష్ దొరికిపోయారు.