Listen to this article

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఏప్రిల్ 8 రిపోర్టర్ సలికినీడి నాగరాజు

అంతే కాకుండా రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు తెలియజేయడం జరిగింది. ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వానికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని గిరిజన ఏపీ గిరిజన సంఘాల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు బి. శ్రీను నాయక్ అన్నారు. మంగళవారం పట్టణంలోని ఎన్నార్టీ సెంటర్లోని గల సంఘం కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఇండియన్ కరెన్సీ అండ్ బ్యాంకింగ్ చరిత్ర అనే పరిశోధన గ్రంధాన్ని రచించారు. అందులోనే భారతదేశానికి బ్యాంకింగ్ వ్యవస్థ ఉండాలనే ఒక ప్రతిపాదనని తెరమీదకు తీసుకొచ్చారు. ఆరోజుల్లోనే సైమన్ కమిషన్ తోపాటు కేంద్ర కౌన్సిల్లో ఆమోదించడం జరిగిందన్నారు.1935 ఏప్రిల్ 1న బ్యాంకింగ్ చట్టం అమలులోకి వచ్చిందన్నారు. దీంతో భారతదేశంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గా రూపాంతరం చెందిందన్నారు. దీనికోసం కృషి చేసిన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ బొమ్మను కనీసం కరెన్సీ నోట్లపై కేంద్ర ప్రభుత్వం ముద్రించకపోవడం సిగ్గుచేటు అన్నారు. ఆయన జయంతి నాడైనా కేంద్ర ప్రభుత్వం కరెన్సీ నోట్ల పైన అంబేద్కర్ ముద్రించాలనే నిర్ణయాన్ని తీసుకోవాలని డిమాండ్ చేశారు.