Listen to this article

మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆంజనేయ గౌడ్,

కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి ఆవుల రాజిరెడ్డి

జనం న్యూస్. ఏప్రిల్ 7. సంగారెడ్డి జిల్లా. హత్నూర. కాంసెన్సీ ఇంచార్జ్. (అబ్దుల్ రహమాన్)

జై బాపు జై భీమ్ జై సంవిధాన్ రాజ్యాంగ పరిరక్షణ యాత్రలో భాగంగా మండల కేంద్రమైన హత్నూర గ్రామం నుండి మొదలై దౌల్తాబాద్ అంబేద్కర్ చౌరస్తా వరకు పాదయాత్రను కొనసాగించారు. ఈ సందర్భంగా మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆంజనేయ గౌడ్,కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి ఆవుల రాజిరెడ్డి, లు మాట్లాడుతూ భారత రాజ్యాంగ పరిరక్షణను కాపాడవలసిన బాధ్యత మన అందరిపై ఉంటుందని ప్రతి ఒక్క పౌరుడు భారత రాజ్యాంగాన్ని కాపాడి సత్యం భావాలను పాటిస్తూ మహాత్మా గాంధీ అంబేద్కర్ ఆలోచన విధానాన్ని అనుసరించి సమ సమాజ నిర్మాణం కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని పిలుపునిచ్చారు. హత్నూర దౌల్తాబాద్ లోని అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసన అనంతరం ప్రతిజ్ఞ చేశారు. బిజెపి ప్రభుత్వం చేస్తున్నటువంటి కుట్రలను ప్రతి ఒక్క యువకుడు తిప్పి కొట్టాలని అన్నారు. అహింసా పద్ధతిలో పోరాటం చేస్తూ ప్రపంచానికి ఆదర్శంగా నిలిచి స్వాతంత్ర సిద్ధింప చేసిన మహాత్మా గాంధీ తో పాటు స్వేచ్ఛ సమానత్వం కోసం రాజ్యాంగం రచించిన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ను బిజెపి బిఆర్ఎస్ అవమానపరచడాన్ని తీవ్రంగా ఖండించారు. ఆ మహనీయుల ఆశయ సాధన కోసం ప్రతి ఒక్క కార్యకర్త ముందుండి నడుం బిగించాలని పిలిపించారు. ఈ కార్యక్రమంలో.మండల పార్టీ అధ్యక్షుడు.కర్రే కృష్ణ.టీపీసీసీ మైనార్టీ విభాగం రాష్ట్ర కార్యదర్శి ఎంఏ హకీమ్ ,కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు సుజాత సత్యం.మాజీ మండల అధ్యక్షుడు. బోరుపట్ల కిష్టయ్య.మాజీ సర్పంచులు. వీరస్వామి గౌడ్. కొన్యాల వెంకటేశం.ఆకుల కిష్టయ్య.ఆత్మ కమిటీ డైరెక్టర్.సురేందర్ రెడ్డి. ఆసిఫ్ హుస్సేన్. ఎన్ ఎస్ యు ఐ రాష్ట్ర నాయకులు చర్ల మణిదీప్.గోవింద్. శ్రీనివాస్ రెడ్డి.నల్లోల్ల పెంటయ్య. వల్లి గారి లక్ష్మయ్య. ఫెంటేష్. రాజేందర్. అజీజ్. సాదుల్లా నసీర్.చెన్నారెడ్డి. పొట్ల చెరువు నరేందర్. రామే రాములు. అల్తాఫ్ హుస్సేన్. గడ్డమీద కృష్ణ. యూత్ కాంగ్రెస్ నాయకులు. వరిగుంతం కృష్ణ. అబ్దుల్ ఖదీర్. టోపీక్. వల్లి గారి సాయికుమార్. అడిగేసాయి. ప్రభు లింగం.వివిధ గ్రామాల మాజీ సర్పంచులు. మాజీ ఎంపీటీసీలు. నాయకులు కార్యకర్తలు తదితరుల పెద్ద ఎత్తున పాదయాత్ర ర్యాలీలో పాల్గొన్నారు.