

రీల్స్ చేయడం ఆపేసి రియల్ లైఫ్ లోకి కౌశిక్ రెడ్డి రావాలి..
ప్రజా సమస్యలు గాలికి వదిలేసిన కౌశిక్ రెడ్డి..
చెక్కులు పంచకపోతే లబ్దిదారులు మండల కార్యాలయాలకు వెళ్లి తీసుకోవాలి..
హుజురాబాద్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ ఒడితల ప్రణవ్..
జనం న్యూస్ // ఏప్రిల్ // 8 // కుమార్ యాదవ్ // జమ్మికుంట..
కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ విషయంలో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి లబ్దిదారులను ఇవ్వకుండా, ఇబ్బంది పెడుతున్నారని,చెక్కులు వచ్చి నెల రోజులు అయినా, ఇంకా వాటిని లబ్దిదారులకు పంపిణి చేయడం లేదని హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ ఆరోపించారు. కమలాపూర్ మండలం ఉప్పల్ గ్రామంలో మంగళవారం బీఆర్ఎస్,బిజేపి పార్టీల నుండి భారీ సంఖ్య లొ ప్రణవ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలోకి చేరారు.ఈ సందర్భంగా వారికి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
అనంతరం ప్రణవ్ మీడియాతో మాట్లాడుతూ… హుజురాబాద్ నియోజకవర్గం లోని జమ్మికుంట, హుజరాబాద్, వీణవంక, కమలాపూర్, ఇల్లందకుంట మండలాల్లో కళ్యాణి లక్ష్మి చెక్కులను సరిగ్గా, డేట్ అయిపోయే ముందు రోజు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి, చెక్కులు లబ్ధిదారులకు పంచుతున్నారని,అన్నారు.
నియోజకవర్గం మొత్తంలో సుమారు 200 పై చిలుకు చెక్కులు మండల తాసిల్దార్ కార్యాలయంలో వచ్చి ఉన్నాయని, పేదలకు పంపిణి చేసే చెక్కులు పంపిణీ చేయకుండా ఇబ్బందులకు, గురి చేయడం కౌశిక్ రెడ్డికి తగదని అన్నారు. ఇదే పద్ధతిని కొనసాగిస్తే లబ్ధిదారులు స్వయంగా, స్థానిక మండల స్థాయి కార్యాలయానికి, వెళ్లి చెక్కులను తీసుకోవాలని,అధికారులు వారికి సహకరించాలని కోరారు.నెలరోజుల క్రితం వచ్చిన చెక్కులను పంపిణీ చేయడానికి కూడా కౌశిక్ రెడ్డికి, సమయం సరిపోవడం లేదని,రీల్స్ చేయడంలో ఉన్న దృష్టి ప్రజా సమస్యల పరిష్కారంలో కూడా ఉండాలని అన్నారు.రీల్స్ లైఫ్ లో కాకుండా రియల్ లైఫ్ లోకి కౌశిక్ రెడ్డి రావాలని కోరారు.రాజకీయాలు పక్కన పెట్టీ చెక్కుల పంపిణీ త్వరగా చేయాలని కోరారు. ఇ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మరియు కార్యకర్తలు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.