Listen to this article

జనం న్యూస్, ఏప్రిల్ 09, పెద్దపల్లి జిల్లా ప్రతినిధి :

ఈ వేసవి కాలంలో ఎండ వేడి తీవ్రంగా ఉన్నందున ప్రజలు వేడి వల్ల వచ్చే అనారోగ్య సమస్యలు మరియు వడదెబ్బ గురి అయ్యే అవకాశం ఉన్నందున తీసుకోవలసిన జాగ్రత్తల పై జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారి, డా. జి. అన్నా ప్రసన్న కుమారి ఒక ప్రకటనలో తెలియచేశారు. ఎండాకాలం లో ఎండ వేడి మరియు వేడి గాలుల వల్ల వడదెబ్బ తగలకుండా ఉండాలంటే చేయకూడనివి ముఖ్యంగా మధ్యాహ్నం 12:00 నుండి 03:00 గంటల మధ్య ఎండలో బయటకు రాకుండా ఉండండి. ఎండ సమయంలో బయట ఉన్నప్పుడు అధిక శ్రమకు దూరంగా ఉండండి.

  • చెప్పులు లేకుండా బయటకు వెళ్ళవద్దు. వేసవి ఎక్కువగా ఉండే సమయంలో వంట చేయడం మానుకోండి. వంట ప్రదేశాన్ని తగినంతగా గాలి వచ్చే విధంగా తలుపులు మరియు కిటికీలను తెరవండి.
  • ఆల్కహాల్, టీ, కాఫీ మరియు కూల్ డ్రింక్స్ లేదా తీపి పానీయాలను నివారించండి- ఇవి వాస్తవానికి, మరింత శరీర ద్రవాన్ని కోల్పోవడానికి లేదా కడుపులో ఇబ్బందికి కారణం కావచ్చు. ఎక్కువ ప్రోటీన్ కలిగిన ఆహారాన్ని మానుకోండి. మరియు నిల్వ ఆహారాన్ని తినవద్దు. ఎండలో ఆపి ఉంచినవాహనంలో పిల్లలను లేదా పెంపుడు జంతువులను వదిలివేయవద్దు. వాహనం లోపల అతి వేడిగా ఉండి వడదెబ్బ తాకవచ్చు. యజమానులు మరియు కార్మికుల కోసం పని ప్రదేశంలో చల్లని త్రాగునీటిని అందించండి. శరీరంలో నీరు కోల్పోకుండా ఉండటానికి ప్రతి 20 నిమిషాలకు లేదా అంతకంటే ఎక్కువ సార్లు కొంచెం కొంచెం నీరు త్రాగాలని చెప్పండి. నేరుగా సూర్యరశ్మిని నివారించేందుకు కార్మికులు జాగ్రత్త వహించండి.
  • కార్మికులకు పని ప్రదేశంలో నీడ ఉండేలా చూడండి. అధిక శారీరక శ్రమ చేసే ఉద్యోగులకు చల్లని సమయాలకు అంటే ఉదయం మరియు సాయంత్రం వేళలకు షెడ్యూల్ చేయండి. బయట ఎండలో పనిచేసే వారి కోసం విశ్రాంతి విరామాల సమయం పెంచండి- కనీసం 1 గంట కార్మిక పని తర్వాత 5 నిమిషాలు విశ్రాంతి ఇవ్వండి. రేడియో వినండి; TV చూడండి; స్థానిక వాతావరణ వార్తల కోసం వార్తాపత్రికను చదవండి మరియు తదనుగుణంగా వ్యవహరించండి. భారత వాతావరణ శాఖ (IMD) వెబ్సైట్లో https://mausam.imd.gov.in/లో తాజా వాతావరణ వివరాలను పొందండి. అదనపు కార్మికులను కేటాయించండి లేదా పని వేగాన్ని తగ్గించండి. కొత్తగా వచ్చిన కార్మికులు వేడి వాతావరణానికి అలవాటు పడేందుకు వారాలు పడుతుంది. మొదటి ఐదు రోజుల పనిలో ఒక రోజులో మూడు గంటల కంటే ఎక్కువ పని చేయవద్దు. పని మొత్తం మరియు సమయాన్ని క్రమంగా పెంచండి. వడదెబ్బ లక్షణాలను గుర్తించడానికి కార్మికులకు శిక్షణ ఇవ్వండి. శిక్షణ పొందిన ప్రథమ చికిత్స అందుబాటులో ఉండాలి మరియు ఎండ వేడి వలన అనారోగ్యం సంభవించినప్పుడు అత్యవసర ప్రతిస్పందన ప్రణాళిక ఉండాలి. గర్భిణీ కార్మికులు మరియు ఆరోగ్య సమస్యలు ఉన్న కార్మికులు లేదా కొన్ని మందులు తీసుకునేవారు వేడిలో పనిచేయడం గురించి వారి వైద్యులతో చర్చించాలి. ఆరుబయట పని చేస్తున్నట్లయితే లేత రంగు దుస్తులు ధరించడం ఉత్తమం, పొడవాటి స్లీవ్ షర్ట్ మరియు ప్యాంటు, మరియు నేరుగా ఎండకు గురికాకుండా తలను కప్పుకోండి. ఉద్యోగులకు అవగాహన కార్యక్రమాలను నిర్వహించండి. కార్యాలయంలో ఉష్ణోగ్రత గురించి సూచనలు చేయండి. సమాచార కరపత్రాలను పంపిణీ చేయండి మరియు అధిక ఉష్ణోగ్రతల సమయంలో తమను తాము రక్షించుకోవడానికి యజమానులు మరియు కార్మికులకు శిక్షణను నిర్వహించండి. సామూహిక జనసమూహం/క్రీడా పోటీల సమయంలో జాగ్రత్తలు అవుట్ డోర్ /ఇండోర్ రద్దీగా ఉండే పరిస్థితులు తీవ్రమైన వేడి వలన అనారోగ్యం కలిగే అవకాశం ఉంది. అధిక శారీరక శ్రమ, నేరుగా ఎండ తగలడం, రద్దీ ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో మరియు నీరు, ఆహారం మరియు నీడ అందుబాటులో లేని పరిస్థితిలో ఆరోగ్యాన్ని మరింత దిగజార్చవచ్చు. జన సమూహంలో ఉన్నప్పుడు శరీరంలో నుంచి నీరు కోల్పోకుండా చల్లగా ఉండాలి, వడదెబ్బ సంకేతాలు, లక్షణాల గురించి తెలుసుకోవాలి మరియు వెంటనే వైద్య సంరక్షణ తీసుకోవాలి.

ప్రజారోగ్యం అధిక ఎండ వేడిమి మరియు వేడి గాలులు తీవ్రత చేయవలసినవి సాధారణ ప్రజల కోసం

  • శరీరం నుంచి నీరు కోల్పోకుండా ఉండండి
  • మీకు దాహం వేయకపోయినా, వీలైనప్పుడల్లా తగినంత నీరు త్రాగాలి. దాహం అవ్వడం మంచి సంకేతం కాదు.
  • ప్రయాణించేటప్పుడు తాగునీరు తీసుకెళ్లండి.
  • ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్ (ORS) ఉపయోగించండి మరియు నిమ్మరసం, వెన్న పాలు/లస్సీ వంటి ఇంట్లో తయారుచేసిన పానీయాలు, ఉప్పు కలిపిన పండ్ల రసాలను తీసుకోండి.
  • తర్బూజా, పుచ్చ (వాటర్ మెలోన్), ఆరెంజ్, ద్రాక్ష, పైనాపిల్, దోసకాయ లేదా ఇతర స్థానికంగా లభించే పండ్లు మరియు కూరగాయలు వంటి అధిక నీరు ఉన్న సీజనల్ పండ్లు మరియు కూరగాయలను తినండి.
  • శరీరాన్ని ఎండ నుంచి కాపాడుకోండి
  • సన్నని వదులుగా, లేత రంగులో ఉండే కాటన్ వస్త్రాలను ధరించడం మంచిది.
  • ఎండలో ప్రయాణం చేసేటప్పుడు మీ తలను గొడుగు, టోపీ, పెద్ద టోపీ, టవల్ తో కానీ నేరుగా ఎండ తగలకుండా ఉపయోగించండి.
  • ఎండలో బయటకు వెళ్లేటప్పుడు బూట్లు లేదా చప్పల్స్ ధరించండి.

అప్రమత్తంగా ఉండండి

  • రేడియో వినండి, TV చూడండి, స్థానిక వాతావరణ వార్తల కోసం వార్తాపత్రిక చదవండి. భారత వాతావరణ శాఖ (IMD) వెబ్సైట్లో https://mausam.imd.gov.in/లో తాజా వాతావరణ సమాచారం పొందండి
  • వీలైనంత వరకు ఇంటి లోపల/నీడలో గాలి ప్రసరించే చల్లని ప్రదేశంలో ఉండండి:
  • ప్రత్యక్షంగా ఎండ మరియు వేడి తరంగాలను నిరోధించండి: పగటిపూట ఎండా సమయంలో కిటికీలు మరియు కర్టెన్లను మూసి ఉంచండి. చల్లటి గాలిని లోపలికి అనుమతించడానికి రాత్రి వాటిని తెరవండి.
  • బయటికి వెళితే, మీ బహిరంగ కార్యకలాపాలను రోజులోని చల్లని సమయాలకు అంటే ఉదయం మరియు సాయంత్రం వరకు పరిమితం చేయండి
  • రోజులో చల్లని సమయాల్లో బయటి పనులు చేసుకోండి అలా ప్లాన్ చేయండి.

    రిస్క్ ఉన్న వారు ఉలనెరేబుల్ పాపులషన్

ఎండ వేడి ప్రభావము అందరిపై ఉంటుంది అయినాప్పటికీ రిస్క్ ఉన్న ప్రజల పై అదనపు శ్రద్ధ వహించాలి.

  • వీటిలో రిస్క్ ఉన్నవారు
  • శిశువులు మరియు చిన్న పిల్లలు
  • గర్భిణీ స్త్రీలు
  • ఆరుబయట పనిచేసే వ్యక్తులు
    శారీరకంగా అనారోగ్యంతో, ముఖ్యంగా గుండె జబ్బులు లేదా అధిక రక్తపోటుతో మానసిక వ్యాధి ఉన్న వ్యక్తులు చల్లని వాతావరణం నుండి వేడి వాతావరణం వరకు ప్రయాణీకుల శరీరాలు వేడికి అలవాటు పడటానికి ఒక వారం సమయాన్ని అనుమతించాలి, అధిక శ్రమను నివారించాలి మరియు పుష్కలంగా నీరు త్రాగాలి. వేడి వాతావరణంలో గురి కావడం/శారీరక కార్యకలాపాలలో క్రమంగా పెరుగుదల (10-15 రోజులకు పైగా) ద్వారా అలవాటు సాధించబడుతుంది.

ఇతర జాగ్రత్తలు

  • ఒంటరిగా నివసించే వృద్ధులు లేదా అనారోగ్యంతో ఉన్న వ్యక్తులు ప్రతిరోజూ పర్యవేక్షించబడాలి.
  • మీ ఇంటిని చల్లగా ఉంచండి, కర్టెన్లు, షట్టర్లు లేదా సన్షేడ్లను ఉపయోగించండి మరియు రాత్రి కిటికీలను తెరవండి. పగటిపూట దిగువ అంతస్తులలో ఉండటానికి ప్రయత్నించండి.
  • శరీరాన్ని చల్లబరచడానికి ఫ్యాన్, స్ప్రే బాటిళ్లు, తడిబట్టలు, ఐస్ టవల్స్ ఉపయోగించండి.
  • చీలమండ పైన 20°C నీటిలో పాదాలను ముంచడం వల్ల డీహైడ్రేషన్ మరియు మేడి ప్రభావాన్ని తగ్గించడం ద్వారా త్వరగా చల్లబరచ గలుగుతాము.

వేడి గాలుల ప్రభావం సంబంధిత ఆరోగ్య సమస్యలు

  • సాధారణ శరీర ఉష్ణోగ్రత 36.4°C నుండి 37.2°C (97.5°F నుండి 98.9°F) మధ్య ఉంటుంది.
  • ఇంటి బయట మరియు లోపల అధిక ఉష్ణోగ్రతలకు గురికావడం వల్ల వేడి ప్రభావం ప్రత్యక్షంగా మరియు పరోక్షంగా, వేడి-సంబంధిత అనారోగ్యాలకు దారితీస్తుంది. వేడి-సంబంధిత అనారోగ్యాలలో (తేలికపాటి నుండి తీవ్రమైన వరకు)-వేడి దద్దుర్లు (ప్రిక్లీ హీట్), చేతులు, పాదాలు మరియు చీలమండల వాపు, హీట్ క్రాంప్స్ (కండరాల తిమ్మిర్లు), వేడినితో స్పృహ కోల్పోవడం (మూర్ఛ), వేడి అలసట మరియు హీట్ స్ట్రోక్. వేడి ఒత్తిడి హృదయ, శ్వాసకోశ, మూత్రపిండాల వ్యాధులు వంటి దీర్ఘకాలిక వ్యాధులను కూడా తీవ్రతరం చేస్తుంది.

వడ దెబ్బ లక్షణాలు

  • మగత లేదా మూర్ఛ,
  • వికారం లేదా వాంతులు,
  • తలనొప్పి
  • విపరీతమైన దాహం
  • అసాధారణంగా ముదురు పసుపు రంగులో తక్కువ పరిమాణంలో మూత్రవిసర్జన
  • వేగవంతమైన శ్వాస మరియు హృదయ స్పందన
  • వేడిగాలులు మరియు వడ దెబ్బ నుంచి రక్షించుకోగలం

విపరీతమైన వేడి సమయంలో మీరు లేదా ఇతరులు అనారోగ్యంగా మరియు పైన పేర్కొన్న ఏవైనా లక్షణాలను గుర్తిస్తే, వెంటనే చల్లని ప్రదేశానికి వెళ్లి ద్రవపదార్థాలు తాగాలి. నీరు తాగడం ఉత్తమం. వెంటనే వైద్య సహాయం పొందండి.

మీ శరీర ఉష్ణోగ్రతను కొలవండి

  • కండరాల నొప్పులను (ముఖ్యంగా కాళ్ళు, చేతులు లేదా ఉదరం, చాలా సందర్భాలలో చాలా వేడి వాతావరణంలో నిరంతర వ్యాయామం తర్వాత), కలిగినట్లయితే వెంటనే చల్లని ప్రదేశంలో విశ్రాంతి తీసుకోండి మరియు లవణాలను కలిగి ఉన్న ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్స్ త్రాగండి.
  • హిట్ క్రాంప్స్ ఒక గంట కంటే ఎక్కువ ఉంటే వైద్య సహాయం అవసరం
  • హిట్ స్ట్రోక్ వైద్య అత్యవసర పరిస్థితి
  • ప్రమాద సంకేతాల గురించి తెలుసుకోండి మరియు మీరు గమనించినట్లయితే వెంటనే వైద్య సహాయం తీసుకోండి
  • పెద్దలలో అయోమయం, గందరగోళం మరియు ఆందోళన, చిరాకు, మూర్ఛ లేదా కోమాతో మానసిక స్థితిలో మార్పు వేడి, ఎరుపు మరియు పొడి బారిన చర్మం శరీర ఉష్ణోగ్రత ≥40°C లేదా 104°F తలనొప్పి ఎక్కువగా ఉండడం ఆందోళన, మైకము, మూర్ఛ మరియు తేలికపాటి తలనొప్పి కండరాల బలహీనత లేదా తిమ్మిరి వికారం మరియు వాంతులు
  • వేగవంతమైన హృదయ స్పందన/వేగవంతమైన, నిస్సార శ్వాస

పిల్లలలో

  • ఆహారం తీసుకోకపోవడం
  • విపరీతమైన చిరాకు
  • తగ్గిన మూత్ర విసర్జన
  • పొడి నోటి శ్లేష్మం & కన్నీరు రాకపోవడం/ కళ్ళు గుంతలు పడడం
  • బద్ధకం/మానసిక స్థితిలో మా
  • మూర్ఛలు
  • ఏదైనా అవయవం నుండి రక్తస్రావం
    (మీరు అధిక శరీర ఉష్ణోగ్రత ఉన్న వ్యక్తిని కనుగొంటే మరియు అపస్మారక స్థితిలో, గందరగోళంగా లేదా చెమట పట్టడం ఆగిపోయినట్లయితే వెంటనే 108కు కాల్ చేయండి)
  • మీకు వీలైతే వారిని చల్లని ప్రదేశానికి తరలించండి
  • దుస్తులు తొలగించి చర్మానికి చల్లని నీటితో లేదా తడి బట్టతో తుడవడం చేయండి.
  • వ్యక్తికి వీలైనంతగా చల్లని గాలి తగిలేలా చూడండి
  • ఆ వ్యక్తి స్పృహలో ఉండి నీరు తాగే స్థితిలో ఉన్నట్లయితే చల్లటి మంచినీరు లేదా ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్ (ORS) , కొబ్బరి నీళ్లు, నిమ్మరసం, మజ్జిగ వంటి ఇంట్లో తయారుచేసిన పానీయాలు తాగించండి. జిల్లా వైద్య మరియు ఆరోగ్యశాఖ అధికారి పెద్దపల్లి.