Listen to this article

జనం న్యూస్, ఏప్రిల్ 09,పెద్దపల్లి జిల్లా ప్రతినిధి

తెలంగాణ రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు మరియు మినిమం వేజెస్ అడ్వైజరీ బోర్డ్ చైర్మన్,ఎస్ సి ఎం ఎల్ యు ఐన్టీయూసీ సెక్రటరీ జనరల్ జనక్ ప్రసాద్  ఆదేశాల మేరకు మంగళవారం కొత్తగూడెంలో సివిల్ జిఎం సూర్యనారాయణ ని మరియు జిఎం హెచ్ఆర్డి రఘుపతి ని  ఆర్జీ3 ఏరియా ఉపాధ్యక్షులు కోట రవీందర్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. సెంటినరీ కాలనీలో ఎదుర్కొంటున్న పలు సమస్యల గురించి వారికి వివరించడం జరిగింది. ఎండాకాలంలో ఎదుర్కొంటున్న నీటి ఎద్దడి  గురించి తెలియజేశారు.పోతన కాలని నుండి సెంటనరీ కాలనీకి వచ్చే నీటి పైప్లైన్, ఓసిపి-2 మెయిన్ రోడ్ మరియు సెంటనరీ కాలని నుండి గోదావరిఖని కి కోల్ కారిడార్ రోడ్డు గురించి త్వరగా ప్రాసెస్ పూర్తి చేయాలని వర్షాకాలం వస్తే పనులు చేయడం ఇబ్బంది అవుతుందని కోరడం జరిగింది.అదేవిధంగా సింగరేణి పరిసర ప్రాంతాల యువతకు స్కిల్ డెవలప్మెంట్ కోర్సులు మరియు అప్రెంటిన్స్ త్వరగా ప్రవేశపెట్టాలని కోరడం జరిగింది. వీరి వెంబడి కార్పొరేట్ వైస్ ప్రెసిడెంట్ పితాంబరం  సత్యనారాయణ రెడ్డి  ఉన్నారు.