Listen to this article

జనం న్యూస్ ఏప్రిల్ 08

నడిగూడెం మండలం చాకిరాల గ్రామ యూత్ కాంగ్రెస్ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు గుండు మహేందర్ గౌడ్ తెలిపారు. మంగళవారం మండలంలోని చాకిరాల గ్రామంలో జరిగిన యూత్ కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో నూతన అధ్యక్షుడుగా మేకపోతుల స్వామి బాబు, ఉపాధ్యక్షులుగా చేకూరి కృష్ణ,ప్రధాన కార్యదర్శిగా నూకపంగు సతీష్, కార్యదర్శిగా మొగలగాని నాగేశ్వరావు లను ఎన్నుకున్నారు.కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షులు మేకపోతుల నాగేశ్వరావు,సీనియర్ నాయకులు రాంపల్లి వెంకటేశ్వర్లు,నూకపంగు వెంకటేశ్వర్లు, మాతంగి శివ, మాతంగి శ్రీను యాతాకుల రాజేష్,రెడ్డి సైదులు, మొగలగాని వెంకన్న,చిర్ర శ్రీను, చేకూరు నరేష్, బండారు నరసయ్య తదితరులు పాల్గొన్నారు..