Listen to this article

జనం న్యూస్ 09 ఏప్రిల్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక

విజయనగరం జిల్లాలో క్యాన్సర్‌ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. ప్రజల హెల్త్‌ ప్రొఫైల్‌పై ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా చేయించిన సర్వేలో ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి. జిల్లాలో క్యాన్సర్‌ కేసులు 5,968, శ్వాస సంబంధిత కేసులు 4,138, నరాల సంబంధిత కేసులు 6,487 నమోదయ్యాయి. అలాగే జిల్లాలో టీబీ, మలేరియా, డయేరియా, రక్తహీనత, ముందస్తు ప్రసవాలు, పోషకాహార లోపం కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయని సర్వేలో వెల్లడైంది.