Listen to this article

పయనించే సూర్యుడు జనవరి 7 ప్రతినిధి భూక్యా కవిత. జగ్గయ్యపేట మండలం, ధర్మవరప్పాడు తండా గ్రామంలో నిర్వహించబడిన సంక్రాంతి ఆటల పోటీలు కబడ్డీ మరియు సంక్రాంతి ముగ్గుల కార్యక్రమంలో జగ్గయ్యపేట నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీరాం రాజగోపాల్ తాతయ్య , జగ్గయ్యపేట మున్సిపల్ చైర్మన్ రంగాపురం రాఘవేంద్ర పాల్గొని పోటీలలో గెలుపొందిన వారికి బహుమతులు ప్రధానం చేశారు.ఈ కార్యక్రమంలో ధర్మవరపాడు తండా గ్రామ సర్పంచ్ మనీ హుస్సేన్ మరియు వైస్ చైర్మన్ సీతారామయ్య ,రామకో సిమెంట్ హెచ్ఆర్ డిపార్ట్మెంట్ సాయి రామకృష్ణ, మంద మరియు గ్రామ నాయకులు గ్రామ పార్టీ అధ్యక్షుడు నున్నవత్తు నారాయణ ఇస్లావత్ జ్వాలా, భూక్యా పరశురామ్ ,చందర్రావు నున్నవత్తు భగవాన్ నాయక్, బాణావతు రామచంద్ర నాయక్ ,భూక్యా మంగ్య,భూక్యా బద్రునాయక్, ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.