Listen to this article

జనం న్యూస్ : 9 ఏప్రిల్ సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి;వై.రమేష్ ; సిద్దిపేట, ఏప్రిల్ 9:


డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ, హైదరాబాద్ ఉత్తర్వుల మేరకు, సిద్దిపేటలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల రీజినల్ స్టడీ సెంటర్‌లో ఏప్రిల్ 12, 2025న “భారత రాజ్యాంగం – సామాజిక న్యాయం” అనే అంశంపై ప్రత్యేక ఉపన్యాసాన్ని నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డా. కె. హుస్సేన్ , మెదక్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ హాజరుకానున్నారు. అదే వేదికపై, ఏప్రిల్ 13, 2025న “భారత రాజ్యాంగ ప్రవేశికను ఎలా అర్థం చేసుకున్నారు?” అనే అంశంపై విద్యార్థులచే ఉపన్యాస పోటీలు నిర్వహించనున్నారు. ఈ పోటీల్లో జిల్లా వ్యాప్తంగా ఆసక్తిగల విద్యార్థులు పాల్గొనవచ్చును. పోటీలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు నగదు బహుమతులు అందజేయనున్నట్లు డా. ఎం. శ్రద్ధానందం రీజినల్ కోఆర్డినేటర్ తెలిపారు.
వివరాలకు డా. బి.ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ – సిద్దిపేట మొబైల్: 97044 25028 సంప్రదించగలరు.