Listen to this article

జనం న్యూస్ ఏప్రిల్ 9 ాట్రేనికోన (ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ)

ప్రభుత్వ పాఠశాలల బలోపేతం,బడి ఈడు పిల్లలందరికీ మెరుగైన విద్యను అందించడమే ప్రభుత్వ లక్ష్యంగా బడిబాట కార్యక్రమం నిర్వహిస్తోందని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా సర్వ శిక్ష అభియాన్ సిఎమ్ఓ బి వి వి సుబ్రహ్మణ్యం తెలిపారు మండల పరిధిలో పల్లంకుర్రు పంచాయతీ శివారు మొల్లేటి మొగ మండల ప్రజా పరిషత్ ప్రాథమిక పాఠశాలలో బుధవారం జరిగిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు,ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ బడి బాటలో చిన్నారుల తల్లిదండ్రులకు విద్య ఆవశ్యకతను వివరించారు.ఇంటింటి ప్రచారం నిర్వహిస్తూ ప్రభుత్వ పాఠశాల నుందు ఆదర్శ ప్రాథమిక పాఠశాలల విశిష్టత,అందుకోసం ప్రభుత్వ చేయబడుతున్న మౌలిక దుపాయాలు,గుణాత్మక విద్య, ఉపాధ్యాయులు పెరుగుదల మొదలగు వివరములు మరియు చదువుకు దూరమైన పిల్లలను పాఠశాలలకు తీసుకు రావటమే లక్ష్యంగా బడిబాట కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు,ఈ కార్యక్రమంలో ప్రధానంగా పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచి పాఠశాలలను బలోపేతం,ప్రైవేట్‌ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వం విద్యా బోధన చేయాలని నిర్ణయించిందన్నారు అనంతరం బడిబాట ర్యాలీని గ్రామ పుర వీధుల్లో ప్రదర్శన చేశారు,ఈ నెల 21వ తేదీ గ్రామ స్థాయి సమావేశాలు ఏర్పాటు చేసి,బడిఈడు పిల్లలందరిని బడిలో చేర్చుకుంటామని ప్రతిజ్ఞ చేయడం,22న ప్రతి ఇంటిని సందర్శించి పాఠశాలకు వచ్చే పిల్లల జాబితాను సిద్ధం చేయనున్నారు.బడీఈడు పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో ప్రవేశం కల్పించి గ్రామ స్థాయిలో రిజిష్టర్‌లో పేరు నమోదు చేయడం,అంగన్‌వాడీ కేంద్రాల్లో తల్లిదండ్రులకు అవగాహన కల్పించడం,బడి బాటపై కరపత్రాలు,బ్యానర్లతో ప్రచారం,బడి బయట ఉన్న పిల్లలను గుర్తించి,పాఠశాలలో చేర్పించే కార్యక్రమాలను చేపట్టడం జరుగుతుందని సుబ్రహ్మణ్యం తెలిపారు,ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి ఎమ్ వెంకట రమణ సిఆర్పిలు కోప్పిశెట్టి నాగ భూషణం,మంత్రి ప్రగడ శ్రీనివాస్,పాము రవి కుమార్,గిడ్డి శ్రీనివాస్,ప్రధానోపాధ్యాయుడు ఎమ్ వి ప్రసాద్,గ్రామ పెద్దలు,
అంగన్ వాడీ కార్యకర్తలు,ఆశ సిబ్బంది,తల్లి తల్లిదండ్రుల పాల్గొన్నారు