

జనం న్యూస్,ఏప్రిల్ 09,
అచ్యుతాపురం: మండలం లోని తిమ్మరాజుపేట గ్రామంలో శిధిలావస్థలో ఉన్న పాఠశాల భవనం విషయం పై ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ దృష్టి తీసుకొని వెళ్ళిన వెంటనే సానుకూలంగా స్పందించి అధికారులతో మాట్లాడి నిర్మాణం పనులు చేయడానికి రూ.13 లక్షల నిధులు మంజూరు చేసారు.ఈరోజు పాఠశాల భవన నిర్మాణ పనులను కూటమి నాయకులు ప్రారంభించి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ కు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ భాగ్యలక్ష్మి, స్కూల్ కమిటీ చైర్మన్ అలేటి వరలక్ష్మి, కాంట్రాక్టర్ శరగడం నాగార్జున, కూటమి నాయకులు శివబాపునాయుడు, మళ్ళ చిన్నబాబు, కర్రి భద్రరాజులు, రేవిడి కృష్ణ, కర్రి వెంకునాయుడు, వెలగా అచ్చింనాయుడు, శరగడం నారాయణమూర్తి, వీరభద్రరావు, స్కూల్ టీచర్ వెంకట అప్పారావు, తదితరులు పాల్గొన్నారు.