

ద్విచక్ర వాహనంపై ఉన్న ఇద్దరకీ గాయాలు.
జనం న్యూస్,ఏప్రిల్, జూలూరుపాడు
: కారు అతివేగంగా వెళ్లడంతో అదుపుతప్పి ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది , ప్రమాదం జరిగిన తీరు,సంఘటన స్థలంలో తెలిసిన వివరాలు మేరకు మండల పరిధిలోని కొమ్ముగూడెం గ్రామం వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది ఖమ్మం వైపు నుండి వస్తున్న కారు ఆర్టీసీ బస్సును ఓవర్ టేక్ చేయబోయి ద్విచక్ర వాహనాన్ని ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది, ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న కరివారిగూడెం గ్రామానికి చెందిన భార్యాభర్తలు గుగులోత్ కోటియా,లక్ష్మీ దంపతులకు గాయాలయ్యాయి
ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న కారు అదుపుతప్పి కొమ్ముగూడెం గ్రామంలోని పెద్దమ్మ తల్లి ఆలయ ప్రహరీ గోడను ఢీక కొనడంతో ప్రహరీ గోడ ధ్వంసం అయింది.ద్విచక్రవాహనం పై ప్రయాణిస్తూ వారు కొత్తగూడెం పట్టణంలో ఓ ప్రైవేట్ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది గాయాల పాలైన భార్యాభర్తలు ఇరువురిని స్థానికులు కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు గాయాలు తగిలిన వారు మండల పరిధిలోని కరివారిగూడెం గ్రామానికి చెందిన సంఘటన స్థలానికి పోలీసులు చేరుకొని ప్రమాదం జరిగిన తీరుపై దర్యాప్తు చేస్తున్నారు.