Listen to this article

ఒక కారు,రెండు బైక్ లు,పది సెల్ ఫోన్లు,రెండు కత్తులు స్వాధీనం

పోలీస్ సిబ్బందిని అభినందించిన డిఎస్పీ

జనం న్యూస్- ఏప్రిల్ 10- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్-

నాగార్జునసాగర్ పోలీస్ స్టేషన్ లో మిర్యాలగూడ డి.ఎస్.పి రాజశేఖర్ రాజు,సి.ఐ శ్రీను నాయక్ విలేకరుల సమావేశం నిర్వహించి వారు మాట్లాడుతూ..గత 2వ తేదీన పండ్ల నిర్మల తన భర్త హరిచంద్ర పెంక్షన్ కొరకు నల్గొండ జిల్లా కనగల్ నుండి నాగార్జునసాగర్ కు రాగా పాత గొడవలు నేపథ్యంలో పసువేముల గ్రామానికి చెందిన వారు కిడ్నాప్ చేశారని విజయపురి టౌన్ పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేయగా వెంటనే స్పందించి సాగర్ సర్కిల్ సి.ఐ శ్రీను నాయక్,ఎస్.ఐ సంపత్, ఎస్.ఐ వీరబాబు,ఎస్.ఐ వీర శేఖర్ ల ఆధ్వర్యంలో మూడు బృందాలుగా ఏర్పడి అన్ని సి.సి.టి.వి లు పరిశీలించి నేరస్తులను గుర్తించి ప్రధాన ముద్దాయి బెజవాడ కోటమ్మను 4వ తేదీన 7వ మైల్ వద్ద అరెస్ట్ చేసి విచారించగా కోటమ్మకు వరుసకు కొడుకు అయిన బెజవాడ బ్రహ్మం కు మృతుడు కూతురితో గత పది సంవత్సరాల క్రితం వివాహం జరిగి తర్వాత ఇరువురి కుటుంబ సభ్యులకు గొడవలు జరగగా ఈ గొడవలో కోటమ్మ కొడుకు రమేష్ మరియు ఇతర కుటుంబ సభ్యులు తీవ్రంగా గాయపడినరని అప్పుడు మృతుడు హరీష్ చంద్ర మరియు అతని కుటుంబ సభ్యులపై రైట్ బ్యాంక్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయిందని ప్రస్తుతం మృతుడు ప్రాణభయంతో కనగల్ గ్రామం నందు కూలి పని చేసుకుంటూ భార్య పిల్లలతో నివాసం ఉంటున్నాడు. అప్పటినుండి కోటమ్మ మరియు అతని కుటుంబ సభ్యులు మృతుడిపై పగ పెంచుకొని ఎలాగైనా చంపాలని నిర్ణయించుకొని అవకాశం కోసం ఎదురుచూస్తున్న క్రమంలో మృతుడు గత నెలలో కనగల్ నుండి నాగార్జునసాగర్ కు వచ్చి పెన్షన్ తీసుకుని వెళుతున్నాడని తెలుసుకొని రెండవ తేదీన కూడా పెన్షన్ కొరకు మృతుడు సాగర్ కు వస్తాడని పసువేముల గ్రామపంచాయతీలో కంప్యూటర్ ఆపరేటర్ నాగయ్య ద్వారా తెలుసుకొని పశువైముల నుండి నేరస్తులు బెజవాడ వెంకటేశ్వర్లు, పండ్ల కోటేశ్వరరావు పల్సర్ బైక్ పై బెజవాడ కోటమ్మ, మహేష్, భార్గవులు హోండా షైన్ బైక్ పై సాగర్ లోని పైలాన్ ఆటో స్టాండ్ వద్దకు వచ్చి అప్పటికే అక్కడ మరొక నేరస్తుడు నెలమట్ల భాస్కర్ తన మారుతి స్విఫ్ట్ డిజైర్ కారుతో పాటు ఉండగా బెజవాడ కోటమ్మ ,బెజవాడ వెంకటేశ్వర్లు కారులోకి ఎక్కినారు కోటి బైక్లో తెచ్చిన రెండు కత్తులలో ఒక కత్తిని కార్లో పెట్టుకోగా రెండో కత్తిని భార్గవ్ బైక్ లో పెట్టుకున్నారు. కోటేశ్వరరావు తన పల్సర్ బైక్ ను ఆటో స్టాండ్ వద్ద పెట్టి భార్గవ్ బండి ఎక్కి హిల్ కాలనీ కి వచ్చారు. ఐదుగురు నేరస్తులు హిల్ కాలనిలో గల ఇందిరాగాంధీ బొమ్మ దగ్గర రోడ్డు ప్రక్కకు కారు మరియు బైకును ఆపుకొని హరిచంద్ర కొరకు ఎదురు చూస్తుండగా హరిచంద్ర సత్యనారాయణ స్వామి గుడి వైపు నుండి రోడ్డు దాటి ఇందిరా గాంధీ బొమ్మ దగ్గరికి వచ్చేసరికి 10 గంటల సమయంలో మృతుడినీ బలవంతంగా కారులో ఎక్కించుకొని కోటమ్మ, కోటి మరియు భాస్కర్లు కారులోనే హరిచంద్ర పై దాడి చేసి చేతులతో గట్టిగా కొట్టుకుంటూ మాచర్ల వైపు ఎత్తిపోతల చెక్పోస్టు దాటిన తర్వాత కార్ ను త్రిప్పి చెంచురాంపురం దాటిన తర్వాత ఒక కిలోమీటర్ ముందుకు వెళ్లి కార్ ని రోడ్డు ఎడమవైపుకి ఆపి ఐదుగురు నేరస్తులు మృతుడిని కారులో నుండి దింపి కొట్టుకుంటూ ఆ ప్రక్కన గల వీరు చలకలోకి 2 అడుగుల లోపలికి హరిచంద్రని తీసుకెళ్లగా అక్కడికి బెజవాడ బ్రహ్మం కూడా చేరుకొని అక్కడ అందరూ కలిసి హరిచంద్రని కొట్టి కిందపడేసి పెద్ద గుండు రాళ్ళను మృతుడి తలపై మోదీ అతి కిరాతకంగా హత్య చేశారు రాళ్లతో గట్టిగా కొట్టడం వలన హరిచంద్ర తలపగిలి తీవ్రముగా రక్తము కారి అక్కడికక్కడే చనిపోయారు అక్కడి నుండి భాస్కర్, భార్గవ్, కోటి, వెంకన్నలు కారులో వాడపల్లి మీదుగా హైదరాబాద్ పారిపోగా కోటమ్మ, బెజవాడ బ్రహ్మం పారిపోయారని తెలిపారు. నిందితుల కోసం వెతుకుతుండగా మంగళవారం మధ్యాహ్నం నమ్మదగిన సమాచారంతో హత్యలో పాల్గొన్న నిందితులతో పాటు వారికి ఆశ్రయం ఇచ్చిన నేలమట్ట బ్రహ్మం, మట్టపల్లి కోటేశ్వరరావు ఇద్దరితో కలిసి షిఫ్ట్ డిజైనర్ కార్లో అడ్వకేట్ ను కలవడానికి మాచర్ల వైపు వెళుతుండగా సాగర్ ఫారెస్ట్ ఆఫీసు వద్ద ఆరుగురు నిందితులను అరెస్ట్ చేయడం జరిగింది అని తెలిపారు. వీరు ఇచ్చిన సమాచారం మేరకు హత్యతో సంబంధం ఉన్న ఇతర నేరస్తులు అయిన బెజవాడ బ్రహ్మం, దోసపాటి నాగయ్యలను రైట్ బ్యాంకులో గల మాత సరోవర్ హోటల్ దగ్గర అరెస్ట్ చేయడం జరిగిందని తెలిపారు. నిందితుల నుండి మారుతి స్విఫ్ట్ డిజైర్ కారు, మరియు రెండు ద్విచక్ర వాహనాలు, 10 సెల్ ఫోన్లు,2 కత్తులను స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇట్టి కేసులో ప్రతిభ కనబరిచిన సీఐ శ్రీను నాయక్, ఎస్ఐలు సంపత్, వీరబాబు, వీరశేఖర్ మరియు పోలీసులు హేమంత్, వెంకన్న, రామకోటి, జావిద్, ప్రశాంత్, రాంప్రసాద్, హెచ్.జి లు శ్రీకాంత్, నరసింహ ఇతర సిబ్బందిని డిఎస్పి రాజశేఖర్ రాజు అభినందించడం జరిగింది.