Listen to this article

ప్రభుత్వ నిర్ణయం వల్ల సబ్సిడీ,సబ్సిడీయేతర వినియోగదారులపై తీవ్ర ప్రభావం

కేంద్ర ప్రభుత్వం గ్యాస్ ధరలను పెంచి ప్రజలపై భారాలను వేస్తున్నది

సిపిఎం పార్టీ సీనియర్ నాయకులు దేవరం వెంకటరెడ్డి

జనం న్యూస్ ఏప్రిల్ 10(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్)

కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని బుధవారం మునగాల మండల కేంద్రంలో సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా మునగాల గ్రామ కమిటీ ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని అండర్పాస్ వద్ద ధర్నా నిర్వహించడం జరిగింది. గ్యాస్ బండపై పెంచిన 50 రూపాయలను వెంటనే ఉపసంహరించుకోవాలని సిపిఎం పార్టీ సీనియర్ నాయకులు దేవరం వెంకటరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ధరలు తగ్గించేంత వరకు పార్టీ ఆధ్వర్యంలో పోరాటాల నిర్వహిస్తామన్నారు వంట గ్యాస్ ధర 50 రూపాయలు పెంచడం వలన ప్రస్తుతం ఉన్న 876 నుండి 905 రూపాయలకు పెరగడంతో పేద మధ్యతరగతి ప్రజల పై అధిక భారం పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే అనేక రకాల నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రజలపై అధికభారాలు పడతాయన్నారు అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గినప్పటికీ దానికి అనుగుణంగా పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు తగ్గించాల్సిన మోడీ ప్రభుత్వం ఆయిల్ కంపెనీల లాభాల కోసం ప్రజలపై భారాలు మోపుతుందని విమర్శించారు ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో సిపిఎం గ్రామ శాఖ కార్యదర్శిలు వెంకన్న గడ్డం వినోద్ బోళ్ళ మంగారెడ్డి ఉప్పల పిచ్చమ్మ లవంగి గోపాలం తదితరులు పాల్గొన్నారు.