

*___ఏపీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఆధ్వర్యంలో**జనం న్యూస్ ఏప్రిల్ 9 (గొలుగొండ మండలం విలేఖరి పొట్ల రాజా:)*అనకాపల్లి జిల్లా గొలుగొండ మండలంలో చిడిగుమ్మల గ్రామ పంచాయతీలో శివారు పోలవరం గ్రామానికి స్పీకర్ అయ్యన్నపాత్రుడు 25 లక్షల రూపాయలు స్మశాన అభివృద్ధికి నిధులు మంజూరు చేశారు. ఇందులో భాగంగా బుధవారం మండల టిడిపి నాయకులు భీమిరెడ్డి సత్యనారాయణ, కామిరెడ్డి గోవిందు, శ్రీరామ్ మూర్తి, లెక్కల శివ, ముందుగా బోరు ఏర్పాటు పనులు ప్రారంభించారు. స్మశానంలో అభివృద్ధి పనులు చేపడుతున్నట్టు మండల నాయకులు తెలియజేశారు .