Listen to this article

జనం న్యూస్ ఏప్రిల్ 10 (గోరంట్ల మండల ప్రతినిధి ఫక్రోద్దీన్)ఫాదర్ ఫెర్రర్ జయంతి సందర్భంగా గోరంట్ల పట్టణంలో స్పందించు సాయ మన్నించు, అనే కార్యక్రమం, శ్రీ మదర్ తెరిసా వికలాంగుల మండల సమాఖ్య సభ్యులు బుధవారం హుంది ఉద్యమంలో పాల్గొని పట్టణంలోని వీరి వీధిలో తిరిగి విరాళం సేకరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉండి ఉద్యమంలో పాల్గొనండి మీ వంతు సహాయం, ఎన్నో జీవితాలను ప్రభావితం చేస్తాయన్నారు. మనం చేసే ప్రతి ఒక్క మంచి పని, ఎక్కడికి పోదు, ఈ ప్రపంచంలో ఎక్కడో ఒక చోట అది శాశ్వతంగా ఉంటుంది అని ఫాదర్ ఫెర్రర్ తెలిపారు అన్నారు. ఈ కార్యక్రమంలో మండల సమైక్య వికలాంగుల సభ్యులు బాబు నాయక్, ఈశ్వరప్ప, నారాయణస్వామి, వెంకటరాముడు, సురేష్ బాబు, రవిచంద్ర రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.