Listen to this article

జనంన్యూస్. 10నిజామాబాదు. ప్రతినిధి.

నిజామాబాదు. ప్రపంచ హోమియోపతి దినోత్సవం సందర్భంగా నేడు జిల్లా జనరల్ ఆసుపత్రి లో 4 వ అంతస్తులో హోమియో పితామహుడు డాక్టర్ శామ్యూల్. హనీమన్ జయంతి శామ్యూల్ ఫోటో కు ఆయుష్ జిల్లా ఇన్చార్జి డాక్టర్ జె.గంగదాసు పూల మాల వేసి ఘనముగా నివాళులు అర్పించారు. డాక్టర్ మాట్లాడుతూ హోమియోపతీ వైద్య పితామహుడు మనుషులు ఎన్నో రకాల వ్యాధులతో పిడింప పడుతున్న వారికి సులభమైన మందుల ద్వారా శీఘ్ర గతిన నయం చేయడానికి చిన్న పిల్లలు వృద్దులు అన్ని వయసుల వారికి సులభముగా తీసుకోవడానికి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని హోమియో పతి వైద్య విధానాన్ని మానవ జాతికి అందించినందుకు కృతజ్ఞతలు తెలుపుచున్నం.ఈ కార్యక్రమం లో డీపీఎం వందన డాక్టర్ తిరుపతి ఆయుష్ ఫార్మ సిస్ట్స్ లు న్యవానంది పురు షో తం ఉమాప్రసాద్ నీరజ భిక్షపతి రమేష్ జిల్లా ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు.