Listen to this article

రైతన్నలకు కష్టాలు..
రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి..

తెలంగాణ రైతు సంఘం జిల్లా కమిటీ సభ్యులు చెల్పూరి రాము.

జనం న్యూస్ // ఏప్రిల్ // 10 // కుమార్ యాదవ్ // జమ్మికుంట)

గురువారం నాడు ఇల్లంతకుంట మండలం శ్రీరాములపల్లి గ్రామంలో ఈదురు గాలులతో నేలకొరిగిన మక్కజొన్న పంటలను పరిశీలించి నా అనంతరం, తెలంగాణ రైతు సంఘం జిల్లా కమిటీ సభ్యులు చెల్పురి రాము.. ఇ సందర్బంగా మాట్లాడుతూ.. శ్రీరాముల పల్లి గ్రామంలో సోమవారం సాయంత్రం విపరీతమైన ఈదురు గాలుల విచాడం వల్ల సుమారు 150 ఎకరాల వరకు మక్కజొన్న పంట నేలకొరిగింది అన్నారు.యాసంగి పంట వేసుకున్న మక్కజొన్న పిసు దశ వచ్చేసరికి, మూలిగే నక్కపై తాటి పండు పడ్డట్టు ఈదురుగాలుల వల్ల మక్కజొన్న పంట నేలకొరిగిందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే వ్యవసాయ శాఖ ద్వారా సమాచారం తెలుసుకొని నెలకొరిగిన మొక్కజొన్న పంటలను వ్యవసాయ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి నష్టపోయిన రైతులకి ప్రభుత్వం నుండి ఎకరానికి 50 వేల రూపాయల నష్టపరిహారం ఇప్పించాలని పేర్కొన్నారు. ప్రతి సంవత్సరం ఈదురు గాలులతో వేల ఎకరాల పంట పొలాలు నష్టపోవడం వలన రైతులు అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకుంటున్నారని రాష్ట్ర ప్రభుత్వం అనావృష్టి వలన నష్టపోయిన పంట పొలాలకు నష్టపరిహారం, చెల్లించి రైతులను ఆదుకోవాలని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతు సంక్షేమమే ధ్యేయంగా చెప్పుకుంటూ అనేక హామీలు ఇస్తున్నారని కానీ ఆచరణలో రైతును ఆదుకునే పరిస్థితి లేదన్నారు. ప్రతి సంవత్సరం బడ్జెట్లో అకాల వర్షాలకు నష్టపోయిన పంట పొలాలకు ప్రత్యేక బడ్జెట్ కేటాయించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే (ఫసల్) బీమా చేయాలని డిమాండ్ చేశారు.లేనియెడల పంట పొలాలు నష్టపోయిన రైతులందరి తో ఆందోళన కార్యక్రమాలు చేపడతామన్నారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం మండల కమిటీ సభ్యులు గ్యారంపల్లి సంతోష్,రైతులు శ్రీకాంత్, శంకర్రావు, రమేష్, పాల్గొన్నారు.