

జనం న్యూస్ // ఏప్రిల్ // 10 // కుమార్ యాదవ్ // జమ్మికుంట)..
కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంట మండలంలో అపర భద్రాద్రిగా పేరుగాంచిన ఇల్లంతకుంట శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానానికి ఇటీవల చైర్మన్ గా పదవి బాధ్యతలు స్వీకరించిన ఇంగిలే రామారావు ను తన చిన్ననాటి స్నేహితులు కలిసి ఘనంగా సన్మానించారు. అనంతరం వారు మాట్లాడుతూ… ప్రజాక్షేత్రంలో తనదైన శైలిలో కాంగ్రెస్ పార్టీలో చిన్న స్థాయి నుండి అంచలంచలుగా ఎదిగి ఇల్లంతకుంట దేవస్థానానికి చైర్మన్ అవ్వడం చాలా ఆనందకరమనీ అన్నారు. చిన్ననాటి నుండి అందరం కలిసి ఆడుతూ పాడుతూ తిరిగిన రోజులను గుర్తు చేసుకున్నారు. ఇలాగే మంచి స్థాయిలో మా స్నేహితుడు ఎంగిలి రామారావు ఎదగాలని వారు ఆకాంక్షిస్తున్నట్టు తెలిపారు. రామారావుపై నమ్మకం ఉంచి ఈ పదవి బాధ్యతలకు సహకరించిన హుజురాబాద్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వొడితల ప్రణవ్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మంద రాజేష్, వడ్లూరి భాస్కర్, రమేష్, సమ్మయ్య,రాజు, బాబు తదితరులు పాల్గొన్నారు.