Listen to this article

జనం న్యూస్ ఏప్రిల్ 10 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి

బిజెపి బస్తీ బాట బస్తీ చలో అభియాన్ కార్యక్రమంలో భాగంగా బాలానగర్ డివిజన్ పరిధిలోని శ్రీ శ్రీ నగర్ బస్తీలో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వడ్డేపల్లి రాజేశ్వరరావు పర్యటించారు, బస్తీ బాట సందర్భంగా శ్రీ శ్రీ నగర్ కు విచ్చేసిన వడ్డేపల్లి రాజేశ్వరరావు నీ బస్తివాసులు ఘనంగా స్వాగతం పలికి సన్మానించారు, అనంతరం బస్తీలో ఉన్న హనుమాన్ ఆలయంలో నిర్వహించిన పూజా కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వడ్డేపల్లి రాజేశ్వరరావు డివిజన్ నాయకులతో కలిసి పాల్గొన్నారు, బస్తీలో ఉన్న రేషన్ దుకాణాలను ఆహార ధాన్యాల పంపిణీ కేంద్రంని సందర్శించి అక్కడకి వచ్చిన ప్రజలకు ప్రధానమంత్రి గరీబ్ అన్న కళ్యాణ్ యోజన కేంద్ర ప్రభుత్వ పథకం ద్వారా వస్తున్న సన్న బియ్యం పంపిణీ చేశారు, జనవరి ఒకటో తారీకు 2024 నుండి ఐదు సంవత్సరాల పాటు అంత్యోదయ అన్న యోజన 81.35 కోట్ల మంది లబ్ధిదారులకు ఉచిత ఆహార ధాన్యాలను అందించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందని.నెలకు ఒక్కొక్కరికి ఐదు కిలోల ఆహార ధాన్యాలు కేంద్ర ప్రభుత్వ వాటాగా వస్తున్నాయని .దీనికోసం కేంద్ర ప్రభుత్వం భరించే వార్షిక ఆహార సబ్సిడీ సుమారు రూ. 2.13 లక్షల కోట్లు, రాబోయే ఐదు సంవత్సరాలలో ఉచితంగా బియ్యం మరియు ఇతర ఆహార ధాన్యాలు ప్రజలకు అందిస్తూ మొత్తం రూ. 11.80 లక్షల కోట్ల వరకు సబ్సిడీ భారాన్ని ప్రజలకోసం భరిస్తుందని తెలియజేశారు, మరియు బస్తీలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను రాజేశ్వరరావు దృష్టికి తీసుకెళ్లగా వాటిని సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కరిస్తానని రాజేశ్వరరావు హామీ ఇచ్చారు, ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు శంకర్ రెడ్డి, సీనియర్ నాయకులు రమేష్, డివిజన్ అధ్యక్షుడు డాక్టర్ కిరణ్ కుమార్, డివిజన్ నాయకులు శ్రీశైలం, వాణి నాయుడు, నాగరాజు, అనిల్ ,విజయ్, రాజు, రమేష్, ప్రసాద్ బస్తీ వాసలు తదితరులు పాల్గొన్నారు.