

జనం న్యూస్, ఏప్రిల్ 11,పెద్దపల్లి జిల్లా ప్రతినిధి
వాణి స్కూల్ యజమాన్యం విద్యార్థిని విద్యార్థుల ఫీజుల విషయంలో వేధిస్తున్నారు , సింగరేణి ఏజమాన్యంతో జరిగిన వాణి స్కూల్ ఒప్పందాన్ని రద్దు చేయాలని నాయకుల డిమాండ్ రామగిరి మండలం సెంటనరీ కాలనీలోని వాణి సెకండరీ స్కూల్ యజమాన్యం స్కూలు యందు ఫీజుల విషయంలో వేధిస్తున్నారని పిల్లల తల్లిదండ్రులు నాయకులకు చెప్పారు,కాంగ్రెస్ పార్టీ నాయకులు,బిజెపి,బి ఆర్ఎస్,బీఎస్పీ,ఐ ఎన్ టి సి ప్రజా సంఘాల నాయకులు వివిధ పార్టీల కార్యకర్తలు వాణి స్కూల్ ప్రిన్సిపాల్ నిలదీశారు.కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు వైనాల రాజు, మాజీ జెడ్పిటిసి వెంకటరమణ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి గాండ్ల మోహన్, యూత్ కాంగ్రెస్ నియోజకవర్గం అధ్యక్షుడు బర్ల శ్రీనివాస్, బేగంపేట శివ, బిజెపి పార్టీ నాయకుడు మాజీ ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు ములుమూరి శ్రీనివాస్, పట్టణ అధ్యక్షుడు తీగల శ్రీధర్, టిఆర్ఎస్ పార్టీ నాయకుడు కన్నూరి శ్రీశైలం,ఆసం తిరుపతి,గుండం రవి, బీఎస్పీ నియోజకవర్గ ఇన్చార్జ్ జనగామ రవి, ఐ ఎన్ టి యు సి నాయకుడు పరంకుశం శ్రీనివాస్ చారి ప్రిన్సిపాల్ ని లదీశారు, వైనాల రాజు, బర్ల శ్రీనివాస్,బేగంపేట శివ, గంట వెంకటరామిరెడ్డి, జనగామ రవి,కన్నూరి శ్రీశైలం,ములుమూరి శ్రీనివాస్,తీగల శ్రీధర్, పరంకుశం శ్రీనివాస్ చారి మాట్లాడుతూ స్కూలు యందు ఎటువంటి వసతులు లేవు,అమ్మాయిలకు సరియైన మరుగుదొడ్లు లేవు, కనీసం మంచినీరు కూడా అందుబాటులో లేకపోవడం విచారకరమని వారన్నారు. వారు మాట్లాడుతూ ఫీజుల విషయంలో అమ్మాయిలను ఎండలో గంటల పాటు నిలబెట్టి నెలసరి ఉన్న పిల్లలను కూడా ఎండలలో నిలబెట్టడం వారు వారి సమస్యలను చెప్పినా కూడా ఫీజులు చెల్లించాలని మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి మాపై ఒత్తిడి చేస్తున్నారని కరస్పాండెంట్ పిల్లలతో చెబుతూ ఫీజులు చెల్లించకపోతే స్కూలు మానేయాలని పిల్లలను వేధిస్తున్నారని వారు అన్నారు.కార్మికుల పిల్లలు భూ నిర్వాసితుల పిల్లలు ఎవరైనా సరే ఫీజులు మొత్తం కట్టాలి, లేనియెడల ఏమి ఎడల స్కూల్ మానేయాలని స్కూల్ యజమాన్యం ఈ పద్ధతి మార్చుకోవాలని వారు హెచ్చరించారు. సింగరేణి నుండి లీజు తీసుకున్న దాసరి మనోహర్ రెడ్డి ఇంకా తన అధికారాన్ని చూపే ప్రయత్నం చేస్తున్నాడని సింగరేణి అధికారులతో లోపాయ కారి ఒప్పందం కుదుర్చుకుని స్కూల్ లీజు కాలాన్ని పెంచుకొని తన ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని వారన్నారు. సింగరేణి కి వాణి స్కూల్ కి మధ్య జరిగిన ఒప్పంద పత్రం ఎంవోయూ ఫీజుల వివరాల పత్రాలు ఇవ్వాలని ఎంఈఓ కొమురయ్య ప్రిన్సిపాల్ ని అడగగా తమ వద్ద లేవని నిర్లక్ష్య సమాధానం ప్రిన్సిపాల్ చెప్పినాడు.సింగరేణి అధికారులు స్పందించి స్కూల్ ని సీబీఎస్సీ చేయాలని స్కూల్ పర్మిషన్ ని రద్దు చేయాలని నాయకులు డిమాండ్ చేశారు. స్కూలు యందు ప్రిన్సిపాల్ తో సమావేశమైన నాయకులు వెళ్లిపోయిన వెంటనే కొందరు పరీక్షలు రాస్తున్న విద్యార్థులను మధ్యలో స్కూల్ యాజమాన్యం ఇంటికి పంపించారని విద్యార్థులు ఏడుస్తూ వెళ్లారని తెలిసింది, రేపు సింగరేణి తో జరిగిన ఫీజు వివరాలు ఎం ఓ యు పత్రాలు ఇవ్వాలని లేనియెడల జేఏసీ ఆధ్వర్యంలో జి ఎం కార్యాలన్నీ ముట్టడించి ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తామని స్కూల్ పర్మిషన్ రద్దు చేసే వరకు ఆందోళన కార్యక్రమాల్ని ఉదృతం చేస్తామని వారు డిమాండ్ చేశారు.స్కూల్లో జరుగుతున్న అన్ని విషయాలను ఐటీ శాఖ మంత్రివర్యులు శ్రీ దుద్దిల్ల శ్రీధర్ బాబు దృష్టికి తీసుకు వెళ్తామని సింగరేణి సిఎండి బలరాం నాయక్ దృష్టికి తీసుకువెళ్తామని ఈ సందర్భంగా వారు అన్నారు. ఈ సమావేశంలో కుక్క రవి, గుండం రవి, మాదాసు విజయ్,కాడిపల్లి సుమన్ తదితరులు పాల్గొన్నారు.