Listen to this article

జనం న్యూస్ ఏప్రిల్ 11(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్)

మునగాల మండల పరిధిలోని మొద్దుల చెరువు గ్రామ శివారులో జాతీయ రహదారిపై 65 పై సూర్యాపేట వైపు నుండి కోదాడ వైపు వెళుతున్న కారు అదుపుతప్పి రోడ్డు వెంట ఉన్న కొలతరాయిని ఢీకొని ఎగిరి పడి పక్కనే రోడ్డు వెంట నిలిపి ఉంచిన ద్విచక్ర వాహనాన్ని ఢీ కొనడం జరిగింది,కారులో భర్త భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు మహిళకు తీవ్ర గాయాలయ్యాయి,మిగతా ముగ్గురికి స్వల్ప గాయాలు కాగా, క్షతగాత్రులను చికిత్స నిమిత్తం స్థానికులు అంబులెన్స్ లో కోదాడ వైద్యశాలకు తరలించారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.