

జనం న్యూస్. ఏప్రిల్ 10. సంగారెడ్డి జిల్లా. హత్నూర. కాంసెన్సీ ఇంచార్జ్.(అబ్దుల్ రహమాన్)
హత్నూర మండల వ్యాప్తంగా గురువారం ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది.ఈదురుగాలుల ప్రభావంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. ఈదురుగాలుల వల్ల దౌల్తాబాద్ బస్టాండ్ సమీపంలో అంబేద్కర్ చౌరస్తా వద్ద ఏర్పాటు చేసిన భారీ కటౌట్ ఈదురుగాలులకు విరిగి ఒకేసారిగా అక్కడే నిలిచి ఉన్న ఆటోపై పడింది.అదే సమయంలో ఆటోలో ప్రయాణికులు ఎవరు లేకపోవడం వలన పెను ప్రమాదం తప్పింది.
