

3 వ రోజు ఆర్డీఓ కార్యాలయం దగ్గర నిరసన ధర్నాలో సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి బుగత అశోక్ ఆగ్రహం
జనం న్యూస్ 11 ఏప్రిల్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక
కూటమి ప్రభుత్వంలో పేదలు 2 సెంట్లు ఇంటి స్థలం కోసం దరఖాస్తులు చేసుకునే హక్కు లేదా అధికారుల దగ్గరకి వెళ్ళి అర్జీలు చేసుకోడానికి వెళ్ళే పేదలని భయపెడతారా అని సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి బుగత అశోక్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు ఇంటి స్థలాలు ఇచ్చి ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయిలు ప్రభుత్వ ఆర్థిక సాయం అందించాలని, ప్రస్తుతం ప్రభుత్వ స్థలంలో ఇల్లు కట్టుకుని నివాసం ఉంటున్న వారికి ఉన్న చోటే పట్టాలు మంజూరు చేయాలని, అర్హులైన వారికి రేషన్ కార్డులు, పెన్షన్లు మంజూరు చేయాలని, కరెంట్ బిల్లులతో సంబంధం లేకుండా డిమాండ్ చేస్తూ గురువారం ఉదయం సీపీఐ విజయనగరం నియోజకవర్గ సమితి ఆధ్వర్యంలో 3 రోజు విజయనగరం ఆర్డీఓ కార్యాలయం వద్ద నిరసన ధర్నా కార్యక్రమం చేపట్టి ఎ. ఓ శ్రీనివాస్ గార్కి వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా బుగత అశోక్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 10 నెలలు అయినా పేదలకు 2 ఇంటి స్థలం ఇచ్చిన దాఖలాలు లేవని విమర్శించారు. గత ప్రభుత్వ హయాంలో ఇచ్చిన ఇంటి స్థలం నిరణానికి ఆర్థిక సాయం అందిస్తామని చెప్పిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సర్వేల పేరుతో కాలక్షేపం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం. ఆర్థిక పరిస్థితి బాగులేక ఇల్లు నిర్మాణం చేసుకోలేని వాళ్ళ దగ్గరకి సచివాలయం అధికారులను పంపించి మీరు ఇల్లు కట్టుకోలేదు కాబట్టి మీ ఇంటి పెట్టాను రద్దు చేస్తున్నాము అని లబ్దిదారులను ఆందోళన గురి చేస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో ఇళ్ల నిర్మాణ ప్రక్రియ సక్రమంగా ముందుకు సాగలేదని కూటమి అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ సాయం పెంచడంతో ఇళ్లు కట్టుకునేందుకు సొంత స్థలం ఉన్నవారు చాలా అర్జీలు చేసుకోడానికి ముందుకు వస్తుంటే వాళ్ళని భయపెడతున్నారని తెలిపారు. గ్రామాల్లో ఇంకా గృహ నిర్మాణాలకు సంబంధించిన ప్రక్రియ మొదలు కాలేదని అధికారులు చెబుతున్నారు. 2014-19 టిడిపి పాలనలోనే ఇదే పరిస్థితి నెలకొంది. తొలుత మూడేళ్లపాటు ఇళ్ల నిర్మాణాలకు అవకాశం ఇవ్వకుండా తర్వాత ఇచ్చారు. ఇళ్ల నిర్మాణం పూర్తయ్యే సరికి 2019 ఎన్నికలు దగ్గరపడ్డాయి. టిడిపి పరాజయం చవిచూసింది అని గుర్తు చేశారు. పట్టణ ప్రాంతంలో రెండు సెంట్ల ఇళ్ల స్థలం ఇచ్చి ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలివ్వాలని గతంలో అనేకసార్లు అర్హులైన వారితో వ్యక్తిగత అర్జీలు ఇచ్చే కార్యక్రమాన్ని చేపట్టినప్పటికీ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల హామీలలో భాగంగా కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చినప్పటికీ అధికారంలోకి వచ్చి 10 మాసాలు గడుస్తున్నా పట్టించుకోకపోవడం విడ్డూరమన్నారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు రెండు సెంట్లు, మూడు సెంట్లు, ఇంటి నిర్మాణానికి నాలుగు లక్షల అని చెప్పి ఇంతవరకు దాని గురించి పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. టిడ్కోఇళ్ళను లబ్దిదారులకు పూర్తిగా అప్పగించకుండ నెలలు గడుస్తున్న ఇచ్చిన హామీలు అమలు చేయడంలో మీనమేషాలు లెక్కిస్తోందని విమర్శించారు ఇళ్ళ స్థలాలు, ఇంటి పట్టాలు పేదలు నివసించే ప్రాంతాల్లో మౌళిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు. పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు ఇంటి స్థలాలు ఇచ్చి ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయిలు ప్రభుత్వ ఆర్థిక సాయం అందించాలని, ప్రస్తుతం ప్రభుత్వ స్థలంలో ఇల్లు కట్టుకుని నివాసం ఉంటున్న వారికి ఉన్న చోటే పట్టాలు మంజూరు చేయాలని, అర్హులైన వారికి రేషన్ కార్డులు, పెన్షన్లు మంజూరు చేసేవరకు భారత కమ్యునిస్టు పార్టీ.(సిపిఐ) పేదల పక్షాన నిలబడి పోరాటాలు కొనసాగిస్తుందని తెలిపారు. ప్రజలను భయపెట్టి ఆపాలని చూసినా భయపడేది లేదని సిపిఐ నేరుగా ప్రజల దగ్గరకి వెళ్ళి పోరాటాలు కొనసాగిస్తుందని బుగత అశోక్ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు ఎస్.రంగరాజు, మార్క్స్ నగర్ శాఖ సహాయ కార్యదర్శి బూర వాసు, బల్జివీధి శాఖ కార్యదర్శి పొందూరు అప్పలరాజు, శాంతి నగర్ శాఖ నాయకులు సూరిడమ్మ, ఏఐటీయూసీ నాయకులు ఆల్తి మరయ్య మరియు ఇళ్ళ స్థలాల కోసం అర్జీలు పెట్టుకున్న మహిళలు హజరయ్యారు.