Listen to this article

జుక్కల్ ఏప్రిల్ 11 జనం న్యూస్

కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం మద్నూర్ మండల కేంద్రంలో మార్కెట్ యార్డులో జొన్న పంట రైతులు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరను సద్వినియోగం చేసుకోవాలని మద్నూర్ సింగిల్విండో చైర్మన్ శ్రీనివాస్ పటేల్ కోరారు. మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో మద్నూర్ సింగిల్ విండో ద్వారా మద్నూర్ మండల కేంద్రంలోని మార్కెట్ యార్డులో కొనుగోలు కేంద్రం ప్రారంభించడం జరిగిందని, జొన్న పంటకు మద్దతు ధర క్వింటాలుకు రూ.3,371 ప్రకటించడం జరిగిందని చైర్మన్ తెలిపారు. తక్కువ ధరలతో దళారులకు అమ్ముకొని మోసపోకుండా మద్దతు ధర కేంద్రంలోని జొన్న పంట అమ్ముకొని మద్దతు ధరను సద్వినియోగం చేసుకోవాలని చైర్మన్ రైతులను కోరారు. ఈ జొన్న పంట మద్దతు ధర కొనుగోలు కేంద్రం ప్రారంభోత్సవంలో ఏఎంసి వైస్ చైర్మన్ పరమేష్ పటేల్, సలాబత్పూర్ ఆంజనేయస్వామి దేవాలయ ధర్మాదాయ శాఖ ఆలయ కమిటీ చైర్మన్ రామ్ పటేల్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు హనుమాన్లు స్వామి, మాజీ ఎంపీపీ ప్రవీణ్ కుమార్, అనుమాంతరావు దేశాయ్, సింగిల్ విండో కార్యదర్శి బాబురావు పటేల్, జొన్న పంట రైతులు తదితరులు పాల్గొన్నారు.