Listen to this article

జనం న్యూస్ ఏప్రిల్ 11 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి

మహాత్మ జ్యోతి రావు పూలే 199వ జయంతి సందర్భంగా మహాత్మ జ్యోతి రావు పూలే చిత్రపటానికి పూలు పూలమాల వేసి ఘన నివాళి అర్పించిన తెలంగాణ మున్నూరు కాపు రాష్ట్ర నాయకులు తెల్ల హరికృష్ణ, మణికంఠ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు సీనియర్ జర్నలిస్ట్ దాసరి రాహుల్ ప్రదీప్, వి రాకేష్, మారుతి సాగర్ తదితరులు పాల్గొని పూలు పూలమాలు వేసి ఘన నివాళులర్పించారు, ఈ సందర్భంగా తెల్ల హరికృష్ణ మాట్లాడుతూ మహాత్మ జ్యోతిబా పూలే జీవితం బహుజనుల స్ఫూర్తిదాయకం స్త్రీల కోసం ప్రత్యేకంగా పాఠశాలలు ఏర్పాటు, వితంతు పునర్వివాహాలు, సమాజంలోని కుల జాడ్యాన్ని రూపుమాపేందుకు ‘సత్యశోధన సమాజ్’ స్థాపన మరియు బ్రాహ్మణ వాదం నశించాలి బహుజన వాదం వర్ధిల్లాలి అనే వంటివి పూలే కృషికి ప్రతీకలు అని వారు కొనియాడారు.