Listen to this article

చిన్నగొట్టిగల్లు ఏప్రిల్ 11జనం న్యూస్ :
శ్రీ సాయిరాం స్కూల్ కరెస్పాండెంట్ జనార్దన్ రెడ్డి ఆధ్వర్యంలో భాకరాపేట శ్రీ సాయిరాం హై స్కూల్ 24వ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా టి టి డి బోర్డు మెంబర్ భానుప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి విద్యార్థి క్రమశిక్షణా విలువలతో కూడిన విద్యను అభ్యసించి, తాము అనుకున్న లక్ష్యాన్ని సాధించుకోవడం కోసం అహోరాత్రులు శ్రమించాలని విద్యార్థులను కోరారు. సామంచి శ్రీనివాస్ మాట్లాడుతూ విద్యను సాధించినప్పుడే అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. ఉన్నత విద్యను అభ్యసించిన ప్రతి ఒక్కరూ సమాజ సేవలో భాగస్వామ్యులవుతారని అన్నారు. తల్లిదండ్రులే తమ పిల్లల భవిష్యత్తుకు పునాది అన్నారు. పిల్లల ప్రవర్తనను గమనించి వారిని సన్మార్గంలోకి నడిపించాల్సిన బాధ్యత తల్లిదండ్రులదేనన్నారు. ప్రతి విద్యార్థి కష్టపడి కాకుండా ఇష్టపడి చదివినప్పుడే వారి భవిష్యత్తు బంగారమయమవుతుందన్నారు. కరస్పాండెంట్ జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు తాము కనిన కలలను, సాకారం చేసుకోవడానికి అహోరాత్రులు నిద్రాగారాలు మాని శ్రమించాలన్నారు. నేడు పోటీ తత్వంలో ఉన్న విద్యారంగం, గత ఏడాదిలో ఎన్నో అవరోదాలను దాటుకుంటూ పదో తరగతి ఉతీర్ణతలో శ్రీసాయిరాం హై స్కూల్ మండల స్థాయి లో ర్యాంకుల పరం పరలను కైవసం చేసుకున్నదని,అందుకోసం పాఠశాల యాజమాన్యం చేసిన కృషి అభినందనీయమన్నారు. ఎంతోమంది విద్యార్థులను విద్యావేత్తలుగా తీర్చిదిద్ది సమాజసేవలో పునరంకితం చేయాలన్నదే తన జీవితం లక్ష్యం అని ఆయన వెల్లడించారు. అనంతరం జరిగిన సాంస్కృతిక కళ లలో విద్యార్థులు కెవ్వు కేక మనిపించేలా డాన్స్లులతో అలరించారు.ఈ కార్యక్రమంలో అపుస్మా కుటుంబ సభ్యులు వెంకటరమణారెడ్డి,టీటీడీ బోర్డు మెంబెర్ భానుప్రకాష్ రెడ్డి, బిజెపి తిరుపతి జిల్లా ప్రెసిడెంట్ సామంచి శ్రీనివాస్,వెంకటరామిరెడ్డి రఘునాధ్ రెడ్డి 7హిల్స్ స్కూల్, ఇండియన్ పబ్లిక్ స్కూల్ కరెస్పాండంట్, అది సార్,తిరుపతి నుండి విశ్వం సార్, రవి, ఓ వి ర్ సార్, వివిధ ప్రాంతాల నుండి అనేకమంది అపుష్మ కరస్పాండెంట్లు కూడా విచ్చేశారు శ్రీ సాయిరాం పాఠశాల యాజమాన్యం ఉపాధ్యాయుని ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు ప్రజలు చాలా పెద్ద ఎత్తున పాల్గొన్నారు, ఆటలను గెలుపొందిన విద్యార్థి విద్యార్థులకు బహుమతి ప్రధానం చేశారు, అక్కడి విచ్చేసినటువంటి అతిథులు అందరు కూడా పాఠశాల సత్కారం చేసి ఘనంగా పంపారు ఈ సందర్భంగా తల్లిదండ్రులు మాట్లాడుతూ ఈ పాఠశాలలో మా పిల్లలను చదవడం అదృష్టంగా భావిస్తామని ఎంతో మంది ఉన్నత విద్య కోసం అర్నిశలు కష్టపడే ఇటువంటి పాఠశాల లో చదవడం అదృష్టంగా భావిస్తామన్నారు…