

జనం న్యూస్ ఏప్రిల్ 12 బీబీపేట్ మండలం
కామారెడ్డి జిల్లాబీబీపేట మండల కేంద్రంలోని బీ ఆర్ ఎస్ పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాజీ జె డ్పి వైస్ చైర్మన్ పరికి ప్రేమ్ కుమార్, మాట్లాడుతూ బీ ఆర్ ఎస్ పార్టీ అధ్యక్షులు కే సి ఆర్, కే టీ ఆర్,ల ఆదేశాల మేరకు పార్టీ ఏర్పడి 25 సంవత్సరాలు గడుస్తున్న సందర్భంగా ఈ నెల 27 న వరంగల్ లో నిర్వహించే సిల్వర్ జూబ్లీ సభకు కామారెడ్డి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్, నాయకత్వంలో బీబీపేట్ మండలం నుండి నాయకులు, కార్యకర్తలు ప్రజలు భారీ సంఖ్యలో తరలిరావాలని బీ ఆర్ ఎస్ సీనియర్ నాయకులు జిల్లా పరిషత్ మాజీ వైస్ ఛైర్మన్ ప్రేమ్ కుమార్, పిలుపునిచ్చారు.. ముఖ్య నేతలతో సమావేశం లో ఆయన మాట్లాడుతూ త్వరలో మరో సమావేశాన్ని నిర్వహించి. పార్టీ శ్రేణులను తరలించే విషయాన్ని చర్చిస్తానని,మండలం నుండి వరంగల్ సభకు వేలాదిగా పార్టీ శ్రేణులు,కార్యకర్తలు,ప్రజలు తరలి వెళ్లాలని సూచించాచారు. కార్యక్రమంలో మాజీ మండల పరిషత్ అధ్యక్షురాలు పసులాది బాలమని, మండల బీ ఆర్ ఎస్ పార్టీ కార్యదర్శి దేవుని పల్లి శ్రీనివాస్, మాజీ ఎంపీటీసీ లక్ష్మారెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ గొబ్బూరి బాపురెడ్డి, కుర్ల సిద్ధ రాములు, పంపరి రాజు, ఎనుగండ్ల రవి, పార్టీ శ్రేణులు,తదితరులు పాల్గొన్నారు.