Listen to this article

జనం న్యూస్. జనవరి 16. సంగారెడ్డి జిల్లా. హత్నూర. కాంసెన్సీ ఇంచార్జ్. (అబ్దుల్ రహమాన్)

చేపల వేటకు వెళ్ళి మత్స్యకారుడు మృతి చెందిన సంఘటన హత్నూర మండలంలోని మధుర గ్రామంలో గురువారంనాడు ఉదయం చోటు చేసుకుంది.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మధుర గ్రామానికి చెందిన లింగన్నగారి నాగరాజు (37) సంవత్సరాలు స్థానిక ఊరు చెరువులో చేపలు పడుతున్న క్రమంలో చేపల వల చుట్టుకొని నీట మునిగి అక్కడికక్కడే మృతిచెందాడు.పోస్టు మార్టం నిమిత్తం మృతదేహాన్ని సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.మృతుని భార్య నర్సమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ కె.సుభాష్ తెలిపారు.