

జనం న్యూస్ 14 ఏప్రిల్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక
ప్రపంచ గొప్ప మేధావులలో ఒకరిగా, ప్రపంచానికే స్ఫూర్తిప్రదాతగా నిలిచిన అంబేడ్కర్ భారతీయునిగా జన్మించడం భారతీయులు చేసుకున్న అదృష్టమని జనసేన పార్టీ నాయకులు గురాన అయ్యలు, ఆదాడ మోహన్ రావులు పేర్కొన్నారు.డా.బి.ఆర్ అంబేద్కర్ గారి 134 వ జయంతిని పురస్కరించుకుని సోమవారం అంబేద్కర్ కాలనీ వద్ద అంబేద్కర్ విగ్రహనికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా వాళ్ళు మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ జీవితం అందరికీ స్ఫూర్తిదాయకమన్నారు. దేశంలోని సంపద, విజ్ఞానం, సామాజిక న్యాయం, అందరికీ సమానంగా అందాలని అంబేద్కర్ ప్రవచించిన ఆదేశిక సూత్రాలకు అనుగుణంగానే జనసేన పార్టీ ఆవిర్భవించిందన్నారు. కుల, మత, ప్రాంతాలకు అతీతంగా రాజ్యాంగ ఫలాలు అందాలనే ఆయన ఆశయాలను జనసేన పార్టీ తరుపున ముందుకు తీసుకెళ్తామన్నారు.
ఈ కార్యక్రమంలో జనసైనికులు, వీర మహిళలు పాల్గొన్నారు