Listen to this article

బిచ్కుంద ఏప్రిల్ 14 జనం న్యూస్ జుక్కల్ నియోజకవర్గం రిపోర్టర్ లక్ష్మణ్

రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా. మాజీ జెడ్పిటిసి ఎన్ రాజు శ్రీహరి రామచందర్. బిచ్కుంద మండల కేంద్రంలో అంబేద్కర్ చౌరస్తాలో ఆ మహానీయుని విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.. దేశ ప్రజలకు బాబా సాహెబ్ అంబేద్కర్ సూచించిన మార్గం ఎప్పటికీ ఆదర్శప్రాయమైనదిగా నిలిచిపోతుందని, భారతదేశం గొప్ప ప్రజాస్వామ్య, గణతంత్ర, లౌకిక రాజ్యంగా వికసించడంలో అంబేద్కర్ గారు ఎనలేని కృషి చేశారన్నారు.. దేశానికి ఆయన అందించిన సేవలు నిరుపమానమని, అసమానతలు లేని సమాజం కోసం ఆయన అనునిత్యం పరితపించారన్నారు.
అంబేద్కర్ గారి స్ఫూర్తితో ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పెట్టుకుని ప్రజా ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పారు..
అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఆ మహనీయుడి సేవలను స్మరించుకుంటూ ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరం కృషి చేద్దామన్నారు. ఈ కార్యక్రమంలో ఆవారా శీను బొమ్మల నాగన్న మారుతి సంజు చింతల ప్రకాష్ టిఆర్ఎస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు