Listen to this article

ఏపీ స్టేట్ బ్యూరో చీఫ్/ రామిరెడ్డి, జనవరి 16, (జనం న్యూస్):-

ప్రకాశం జిల్లా, బేస్తవారపేట మండలం కలగొట్ల వద్ద పొగాకు కూలీల ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ ఘటన లో మార్కాపురం మండలం భూపతిపల్లి గ్రామానికి చెందిన కాశయ ,శ్రీను అనే ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. అలాగే మరో ఐదుగురికి గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను కంభం ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.