Listen to this article

జనం న్యూస్ ఏప్రిల్ 14 కాట్రేని కొన (ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజ)


కాట్రేనికోన మండల గోదావరి విలేఖరి జగడం శ్రీనివాస్ ను ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు (బుచ్చిబాబు) సోమవారం పరామర్శించారు.గత వారం రోజుల క్రితం కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొంది ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్న శ్రీనివాస్ ను సోమవారం ఆయన స్వగృహంలో ఎమ్మెల్యే బుచ్చిబాబు పరామర్శించారు.ఆయన ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు.ఆయన వెంట మాజీ ఎమ్మెల్యే చెల్లి వివేకానంద, మత్స్యశాఖ కార్పొరేషన్ మాజీ చైర్మన్ నాగిడి నాగేశ్వర రావు,,నడింపల్లి సుబ్బరాజు, దాట్ల పవన్,నాయకులు విత్తనాల బుజ్జి ,వాసంశెట్టి రాజేశ్వర రావు ,సత్తాల ప్రసాద్, రేవు రమేష్,మోకా అప్పాజీ, జగడం విజయ్ కుమార్,ఉరంకృష్ణ, సి.హెచ్.సుభాష్ తదితరులున్నారు