

జనం న్యూస్ ఏప్రిల్ 14 నడిగూడెం
మండలం లోని రత్నవరం గ్రామంలో అంబేద్కర్ యూత్ ఆధ్వర్యంలో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. యూత్ అధ్యక్షుడు కామళ్ళ వినోద్ మాట్లాడుతూ.. అంబేద్కర్ ఆశయాలను యువత ముందుకు తీసుకెళ్లాలని, సమాజంలో సమానత్వం కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో యూత్ కమిటీ సభ్యులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.