Listen to this article

జనం న్యూస్ ఏప్రిల్ 14 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ

బాబాసాహెబ్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135 వ జయంతి పురస్కరించుకొని 80 వ వార్డు అంబేద్కర్ నగర్ లో ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్దకు శాసనమండలి సభ్యులు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి బుద్ధ నాగ జగదీశ్వరరావు పాల్గొని పూలమాల వేసి ఘనమైన నివాళులర్పించారు. ఈ సందర్భంగా కార్యకర్తలను ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ బాబాసాహెబ్ అంబేద్కర్ స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొని రాజ్యాంగాన్ని రచించిన మహోన్నత వ్యక్తి, అనిచివేతకు గురైన వర్గాల ప్రతినిధిగా అంబేద్కర్ వయోజన ఓటు హక్కు ప్రాధాన్యతను తెలియజేసి మద్దతు ప్రకటించి, ఓటు హక్కు కల్పిస్తే అధికారం ఇచ్చినట్లుగా భావించి బడుగుల జీవితాలు మెరుగుపడతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో కుప్పిలి జగన్ బోడి వెంకటరావు పిళ్ళా తారకేష్ మల్ల గణేష్ యల్లపు నూకేష్ దాడి అప్పారావు రామోజీ శ్యామ్ సుందర్ బొడ్డేడ దేవయ్య బుద్ధ భువనేశ్వరరావు పెంటకోట శివరాం బుద్ధ మహాలక్ష్మి నాయుడు కాండ్రేగుల జగదీష్ కాండ్రేగుల వెంకట సూరిబాబు పెంటకోట వరప్రసాద్ బుద్ధ విశ్వనాథం సూరిశెట్టి శ్రీనివాసరావు కాండ్రేగుల రవీంద్ర దాడి వేణు శ్రీకాకుళం గణపతి చింతపల్లి కృష్ణ కాండ్రేగుల గోపికృష్ణ బుద్ధ శ్రీనివాసరావు బొడ్డేడ నూకరాజు పెంటకోట శివరాం గొడుగు కొణతాల బాల సాలాపు నాయుడు నడిపురి నడిపూరి వీరి నాయుడు ఎర్రమళ్ళకేశవ మర్ర జోగారావు కట్ట అప్పలరాజు గోవాడ రాజు నేతల చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.//