Listen to this article

జనం న్యూస్, ఏప్రిల్ 15 ( తెలంగాణ స్టేట్ ఇన్చార్జ్ ములుగు విజయ్ కుమార్ )

సిద్దిపేట జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ జయంతి ఈ సందర్భంగా ఆయన విగ్రహానికి( పి డి ఎం ,బీ డీ ఎస్ ఎఫ్, బి ఎఫ్ టి యు,) ఆధ్వర్యంలో పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది.
ఈ సందర్భంగా పిడిఎం రాష్ట్ర కోకన్వీనర్ కొమ్ము దుర్గారాo, బహుజన ప్రజాస్వామ్య విద్యార్థి సమైక్య రాష్ట్ర ఉపాధ్యక్షులు దబ్బెట ఆనంద్, మాట్లాడుతూ బాబాసాహెబ్ అంబేద్కర్ గా సుపరిచితుడు 1891 ఏప్రిల్ 14 జన్మించారు ఆయన ప్రముఖ భారతీయ న్యాయవాది, ఆర్థిక శాస్త్రవేత్త, రాజకీయ నేత, సంఘ సంస్కర్త. ఇతను కొలంబియా విశ్వవిద్యాలయం నుండి పి.హెచ్.డి., లండన్ విశ్వవిద్యాలయం నుండి డి.ఎస్.సి (డాక్టరేట్) పట్టాలను పొంది చాలా అరుదైన గౌరవాన్ని సంపాదించాడు. న్యాయ, సామాజిక, ఆర్థిక శాస్త్రాలలో పరిశోధనలు చేశాడు. మొదట్లో న్యాయవాదిగా, అధ్యాపకుడిగా, ఆర్థికవేత్తగా పనిచేశాడు. తరువాత భారతదేశ స్వాతంత్ర్యం, పత్రికల ప్రచురణ, దళితుల సామాజిక రాజకీయ హక్కులు, భారతదేశ రాజ్యాంగ వ్యవస్థాపన కోసం కృషి చేశాడు. 1956లో ఇతను బౌద్ధ మతాన్ని స్వీకరించడంతో దళితులు సామూహికంగా బౌద్ధంలోకి మత మార్పిడి చేసుకున్నారు. 1990లో భారత ప్రభుత్వం అత్యున్నత పౌర పురస్కారం భారత రత్నను ఇతనికి మరణాంతరం ప్రకటించింది. భారతదేశ చరిత్రలో చిరస్మరణీయంగా నిలిచిన నాయకుడు. ఆయన చేసిన విశేష కృషికి ఇతని పుట్టినరోజును “బడుగు బలహీన వర్గాలు పండుగ రోజుగా జరుపుకుంటారు. కులనిర్మూలన కోసం ఎంతో కృషి చేశాడు. అతను స్వతంత్ర భారతదేశపు మొట్టమొదటి కేంద్ర న్యాయశాఖ మంత్రి, కూడా వ్యవహరించాడు తన జీవిత కాలమంతా కూడా బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం పోరాటాలు చేశారని మన రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి పైన ఉందని తెలియజేశారు. ఈ మహనీయున్నీ పార్లమెంట్లో అమీషా అవమానించడం చాలా దుర్మార్గమైన చర్య ఇటువంటి చర్యలకు పాల్పడితే తగిన బుద్ధి చెప్పడం జరుగుతుంది అని ఘాటుగా స్పందించారు.ఈ కార్యక్రమంలో బహుజన మహిళ సమాఖ్య సిద్దిపేట జిల్లా కన్వీనర్ కొండ వర్షా , సినీ కమీడియన్ సుబ్బు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎర్ర కృష్ణ తదితరులు పాల్గొన్నారు.