Listen to this article

జనం న్యూస్ ఏప్రిల్ 14 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి

మైత్రి కన్సల్టేషన్ ఆద్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు రెండువేల మందికి మజ్జిగ పంపిణీ కూకట్ పల్లి సర్కిల్ పరిధిలోని ఉషామూళ్ళ పూడి కమాన్, అల్లూరి సీతారామరాజు విగ్రహం వద్ద మైత్రి కన్సల్టేషన్ ఆద్వర్యంలో ఏర్పాటు చేసిన డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్135వ జయంతి వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు. అనంతరం మైత్రి కన్సల్టేషన్ ఆద్వర్యంలో రెండు వేల మందికి మజ్జిగను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సభ్యులు దళిత సంఘం నాయకుడు గుర్రం రవికుమార్ మాట్లాడుతూ.ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల తోపాటు అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్లను కల్పించాలని సూచించడం ఆయన ముందు చూపుకు నిదర్శనం అని అన్నారు. దళిత రత్న పి.ఎల్ ప్రసాద్ మాట్లాడుతూ… రాజ్యాంగ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, అంబేద్కర్ జయంతి సందర్భంగా మజ్జిగను పంపిణీ చేసిన మైత్రి కన్సల్టేషన్ సభ్యులను అభినందించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ పాత్రికేయులు నజీర్ భాయ్, రాహుల్ ప్రదీప్, మహేష్ కుమార్, అర్జున్, సభ్యులు, కాలనీ వాసులు పెద్దఎత్తున పాల్గొని నివాళులు అర్పించారు.