Listen to this article

జనం న్యూస్ జనవరి 16 మండలం పెన్ పహాడ్:
మండల పరిధిలోని గాజుల మల్కాపురం గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు మామిడి వెంకన్న గౌడ్ తండ్రి గారైన చీదెళ్ళ పి ఎ సి ఎస్ డైరెక్టర్ మామిడి క్రిష్ణయ్య పార్థివదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన రామ్ రెడ్డి సర్వోత్తమ్ రెడ్డి ,పబ్లిక్ క్లబ్ కార్యదర్శి కొప్పుల వేనారెడ్డి వారు మాట్లాడుతూ క్రిష్ణయ్య లేని లోటు కాంగ్రెస్ పార్టీకి తీరని లోటుని పార్టీలో చురుగ్గా పాల్గొనేవాడని ఈ సందర్భంగా అన్నారు.అదేవిధంగా కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియపరిచారు. ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ తూముల భుజంగరావు, పెన్ పహాడ్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తూముల సురేష్ రావు, పెన్ పహాడ్ మాజీ జెడ్పిటిసి పిన్నెని కోటేశ్వరరావు నాయకులు తదితరులు పాల్గొన్నారు