

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఏప్రిల్ 14 రిపోర్టర్ సలికినీడి నాగరాజు
ఈరోజు పట్టణంలోని రాష్ట్రీయ జన క్రాంతి పార్టీ కార్యాలయంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 134 వ జయంతి సందర్భంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చిత్రపటానికి విగ్రహానికి పూలమాలలు వేసి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమాన్ని ముఖ్యఅతిథిగా ఎస్సీ ఎస్టీ, బీసీ ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షురాలు పాలేటి అమృత మాట్లాడుతూ మనకు హక్కులు కల్పించిన అంబేద్కర్ గారికి ఎంత రుణపడి ఉంటామని ఆయన ఆశయాలను ముందుకు తీసుకుపోతామని ఐక్యవేదిక తరపున తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి కొమ్ముల రమేష్ బొప్పూరి జయప్రద ఆదిలక్ష్మి శ్యామ్ రఘువీరా రాష్ట్రీయ జనక్రాతి పార్టీ షేక్ గౌస్ జన క్రాంతి పార్టీ పట్టణ అధ్యక్షుడు షేక్ మౌలాలి ఎం కరిముల్లా తదితరులు పాల్గొన్నారు